TTD tickets book on WhatsApp .. Step by step ..
టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించి అనేక రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా మరిన్ని సేవలను చేర్చుతున్నారు.
తాజాగా, టీటీడీకి సంబంధించి నాలుగు సేవలను వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తెచ్చారు.
స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్‌లు సమాచారంతో పాటు ప్రస్తుతం ఎన్ని టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి? సర్వ దర్శనం క్యూలైన్ ఏ మేరకు ఉంది? శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతోంది? శ్రీవాణి టికెట్లకు సంబంధించిన సమాచారం దీని ద్వారా భక్తులు తెలుసుకోవచ్చు. రూమ్స్ కోసం డిపాజిట్ రీఫండ్ వివరాల వంటి సమాచారం కూడా అందుకోవచ్చు.
టికెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు..
- 9552300009 వాట్సాప్ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి
- వాట్సాప్ తెరిచి ఆ నంబర్‌కు “హాయ్” మెసేజ్ పంపండి
- మీకు కావాల్సిన సేవలను ఎంచుకోండి
- అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుండి “ఆలయ బుకింగ్ సేవలు” ఎంచుకోండి
- దర్శన టిక్కెట్లు, సేవా రిజర్వేషన్లు, వసతి, ఇతర సౌకర్యాల బుక్‌కు చాట్‌బాట్ సూచనలు ఇస్తుంది
- స్లాటెడ్ సర్వదర్శనంతో పాటు సర్వ దర్శనం, శ్రీవాణి కౌంటర్ స్టేటస్ డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ ఆప్షన్‌లు ఉంటాయి
- వాట్సాప్‌లో బుకింగ్ వివరాలను అందుకుంటారు
- దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
0 Response to "TTD tickets book on WhatsApp .. Step by step .."
Post a Comment