Day-27 We Love Reading 24. 05.2025 Summer Activities
డే-27 క్లాస్ 3-5 మేము వేసవి కార్యకలాపాలను చదవడానికి ఇష్టపడతాము 24.05.2025
డే-27 క్లాస్ 3-5 వి లవ్ రీడింగ్ సమ్మర్ యాక్టివిటీస్ 24.05.2025. 29వ రోజు, 2023 మే 29న 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతికి సంబంధించిన వి లవ్ రీడింగ్ యాక్టివిటీస్ మరియు సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Day-27 Class 3-5 We Love Reading: తెలుగు కథ : మూడు వరాలు
చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు.
ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్టపడేవారు, కానీ యెంత కష్ట పడ్డా బీదరికం తప్పలేదు.
ఒక రోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది.
ఏంటో కాలంగా రాయి లో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి మూడు వరాలు ప్రసాదించింది.
భార్య రైతుతో, “డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సద్దుకుంటాయి” అంది.
రైతు, “వద్దు! హటాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళి పోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము” అన్నాడు.
అలాగే దేవత వాళ్లకు ఒక్క రోజు గడువు ఇచ్చింది.
ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్ళాం రైతుతో, “డబ్బే అడగాల్సింది. ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే యెంత బాగుండేది!” అని నిట్టూర్పుతో అంది.
వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండి పోయాయి.
రైతు కోపంగా, “అనవసంగా ఒక వరం పాడు చేసావు! ఇప్పుడా కోడికూర నీ ముక్కులో పెట్టుకో!” అని తిట్టాడు.
కూర ఆమె ముక్కులో వెంటనే పోయి ఇరుక్కుంది. ఇద్దరు భయ పడిపోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు.
అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయం అయిపోయాయి.
అలా ఆలోచించకుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు మూడు వరాలనీ వేస్టు చేసుకున్నారు.
ఆ తరువాత తల పట్టుకుని బాధ పడితే మట్టుకు ఏం లాభం!
డే-27 క్లాస్ 3-5 మాకు చదవడం చాలా ఇష్టం: ఇంగ్లీష్ : దాహంతో ఉన్న కాకి
ఈ రోజు మనం కథను తమాషాగా చదవబోతున్నాం.
డే-27 క్లాస్ 3-5 మాకు చదవడం చాలా ఇష్టం: గణితం: సంఖ్యల పోలిక
డే-27 క్లాస్-3-5 మేము చదవడానికి ఇష్టపడతాము: 6 తో ఉడుతను గీయండి
0 Response to "Day-27 We Love Reading 24. 05.2025 Summer Activities"
Post a Comment