Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway new Rule .. Finnies are fixed .. The Indian Railway Department has noticed the train passengers.

 అమల్లోకి రైల్వే కొత్త రూల్.. ఇన్నాళ్లూ ఫైంతో సరిపెట్టారు.. ఇకపై రైలు నుంచి దించేస్తారు.

రైల్వే కొత్త రూల్.. ఫిన్నీలు ఫిక్స్ అయ్యాయి.. రైలు ప్రయాణికులను భారత రైల్వే శాఖ గమనించింది.

రైలు ప్రయాణికులకు భారత రైల్వే శాఖ ముఖ్య గమనిక చేసింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తే భారీ జరిమానాతో పాటు రైలు నుంచి నిర్ధాక్షిణ్యంగా దింపేయడం జరుగుతుందని రైల్వే ప్రకటించింది.

టికెట్ ఖాయం చేసుకుని ప్రయాణం చేస్తున్న రైలు ప్రయాణికులకు ప్రస్తుతం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే టికెట్ శాఖ వెల్లడించింది.

ఇప్పటికీ కొందరు రైలు ప్రయాణికులు టికెట్ కన్ఫార్మ్ కాకపోయినప్పటికీ వెయిటింగ్ టికెట్తో రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణిస్తున్నారు. టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి వెయిటింగ్ టికెట్కు కూడా ఎంతో కొంత చట్టబద్ధత ఉంటుందనే నమ్మకం ఉంది. టీటీ వచ్చినా ఆ టికెట్ చూపించి ఫైన్ అమౌంట్ కట్టి హాయిగా ప్రయాణం చేస్తున్నారు.

రైల్వే తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఇలా నడపడం కుదరదు. రిజర్వ్డ్ కోచుల్లో టికెట్ కన్ఫార్మ్ కాకుండా ప్రయాణం చేస్తే ఫుల్ టికెట్ ఫేర్తో పాటు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. రైలు నుంచి దించేసే అధికారం ట్రైన్ టికెట్ ఎగ్జామినర్కు (TTE) ఉంది. మే 1, 2025 నుంచి రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రైలు ప్రయాణికులు ఈ శాఖ సూచనల దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. రిజర్వ్డ్ సీట్లలో వినియోగించే అర్హత కన్ఫర్మ్డ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక ఏంటంటే.. వేసవి సెలవులకు తిరుపతి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న కారణంగా చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 7 నుంచి జూన్ 25వ తేదీ వరకు చర్లపల్లి నుంచి 8 ప్రత్యేక రైళ్లు నడుస్తుంది. ప్రతి రోజూ సాయంత్రం 6.50 గంటలకు స్పెషల్ ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు.

అలాగే మే 8 నుంచి స్పెషల్ ట్రైన్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం 4.55 గంటలకు స్పెషల్ ట్రైన్ తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగాలి అని చెప్పారు.1ఏసీ 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు అందుబాటులో ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway new Rule .. Finnies are fixed .. The Indian Railway Department has noticed the train passengers. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0