Sania Mirza Sensational Post on Operation Sindoor ..
ఆపరేషన్ సిందూర్పై సానియా మీర్జా సంచలన పోస్ట్.. వాళ్లకే సపోర్ట్
పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం లేదు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఈ ఘటనపై సానియా మీర్జా రియాక్ట్ అయ్యారు.
పాకిస్థాన్‌పై భారత్ చేసిన 'ఆపరేషన్ సిందూర్'ను ఆమె సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "ఒకే ఒక్క ఫొటోతో భారత్ తన సందేశాన్ని స్పష్టంగా వినిపించింది. ఇదే మా దేశం" అంటూ సానియా మీర్జా ఒక శక్తివంతమైన పంచుకున్నారు. ఆ ఫోటోలో కల్నల్ సోఫియా ఖురేషి ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు.
వీరిద్దరూ సిందూర్‌కు సంబంధించిన ఆపరేషన్ దేశానికి తెలియజేశారు. విశేషం, కల్నల్ సోఫియా ఒక ముస్లిం కాగా, వింగ్ కమాండర్ వ్యోమికా సిక్కు. వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి (కశ్మీరీ పండిట్) కూడా ఉండటంతో ఆ ఫోటోలోని ఐక్యతను మరింతగా చాటిచెబుతోంది.
పహల్గామ్‌లో ఉగ్రవాదులు మత ప్రాతిపదికన ప్రజలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో, ఈ ముగ్గురు వ్యక్తులు మతాలకు చెందిన వారు కలిసి నిలబడటం సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. సానియా మీర్జా ఈ ఫోటోను షేర్ చేస్తూ, భారతదేశం యొక్క బలం దాని భిన్నత్వంలోనే ఉందని గట్టిగా చాటిచెప్పారు.
సానియా మీర్జా చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ఆమె దేశభక్తిని, ధైర్యాన్ని కొనియాడుతున్నారు. "ఇదే నిజమైన భారతదేశం", "సానియా గారు గర్వంగా ఉంది", "మాటల మధ్య చిచ్చు పెట్టేవారికి ఇది గట్టి సమాధానం" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
0 Response to "Sania Mirza Sensational Post on Operation Sindoor .."
Post a Comment