Twin Sisters Adars - Not in the form, but in the marks.
ట్విన్ సిస్టర్స్ అదుర్స్- రూపంలోనే కాదు మార్కుల్లోనూ సేమ్ టూ సేమ్ - ట్విన్ సిస్టర్స్ సేమ్ మార్క్స్.
పదోతరగతిలో సేమ్ మార్కులు సాధించిన ట్విన్ సిస్టర్స్
SSC లో Twin Sisters Same Marks :కవలలు అనగానే ఇద్దరూ చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. కొన్ని సార్లు వాళ్లని గుర్తు పట్టడం కూడా కష్టమే. అయితే వారి మార్కులు కూడా సేమ్‌గా ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. తమిళనాడుకు చెందిన కవలలు పదో తరగతి పరీక్షల్లో ఒకే మార్కులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
కోయంబత్తూరులోని రామనాథపురంలో ఉన్న సుందరరాజన్, భారతి సెల్విల కుమార్తెలు కవిత, కనిక కవల పిల్లలు. ఈ ఇద్దరు అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నారు. అయితే తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని తెలుసుకునేందుకు వెళ్లి ఈ సిస్టర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరికీ ఒకే మార్కులు వచ్చాయి.
గణితంలో కూడా సేమ్
కవిత మార్కులు చూస్తే, తమిళం- 95, ఇంగ్లీష్-98, గణితం – 94, సైన్స్ – 89, సోషల్– 98, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఇక కనిక మార్కులు చూస్తే, తమిళం– 96, ఇంగ్లీష్ – 97, గణితం – 94, సైన్స్ – 92, సామాజిక శాస్త్రం – 95, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం గణితంలో ఇద్దరికి ఒకే మార్కులు వచ్చాయి.
'మేం ఊహించలేదు'
ఇద్దరికీ ఇలా ఒకే మార్కులు వస్తాయని తాము కూడా ఊహించలేదని ట్విన్ సిస్టర్స్ చెప్పారు. ఇలా మాకు ఒకే మార్కులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మమ్మల్ని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని కవిత, కనిక చెప్పారు.
0 Response to "Twin Sisters Adars - Not in the form, but in the marks."
Post a Comment