How to put the Mahalaya Squads?
మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి
మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు (15) రోజులనే మహాలయ పక్షాలు అంటారు♪. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు.
మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయపక్షముల ముఖ్యోద్దేశము
08-09-2025 నుండి 21.09.2025 వరకు మహాలయ పక్షాలు♪. - భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు♪.
పితృదేవతలకు.... ఆకలా...?
అనే సందేహం కలుగవచ్చు♪. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది♪.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః
అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది.
అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి♪. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి♪. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి♪. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి♪. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు♪.
మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది♪. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుషప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్లకణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది♪.
మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి♪. అలా జరగాలంటే..
పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి♪. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి♪. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి♪. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది♪. ఋణం తీరడమే మోక్షం అంటే♪. ఎవరికైనా ఇంతే♪
తద్దినాలు పెడుతున్నాం కదా!... మహాలయ పక్షాలు పెట్టాలా?
అనే సందేహం తిరిగి కలుగవచ్చు♪. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం♪.
పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు♪. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే.... కాదు, అంటుంది శాస్త్రం♪.
మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు♪. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు♪. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు♪. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారాకానీ, ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు, వరదలు) ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు♪. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి♪.
పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది♪.
కానీ, ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది♪. దీనినే _*సర్వకారుణ్య తర్పణ విధి*_ అంటారు♪.
ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది♪. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు♪.
మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?
సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం♪. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం♪. దీనినే... _*సర్వ పితృ అమావాస్య*_ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి♪.
క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి♪.
భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర, పెట్టి సత్కరించి పంపాలి♪.
చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి♪. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు♪. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి♪.
ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి *ఘటచతుర్థి* నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి♪.
మహాలయ పక్షం (ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఏమి లభిస్తుంది)
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం♪. మహాలయ పక్షం ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు♪. తండ్రి చనిపోయిన తిథి రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధి జరుగును♪. వారు ఉత్తమ గతిని పొందుతారు♪. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి♪.
భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము.
మహాలయమంటే - మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా* అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.
అమావాస్య అంతరార్థం:
‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం.* చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి♪.
మహాలయ పక్ష ప్రారంభం నుండి (రేపటి నుండి) పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి♪.
పితృ దోషం అంటే ఒక శాపం♪. గతజన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి♪. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు♪. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి♪.
పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం♪. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు♪. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి♪. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు♪. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు
ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది♪.
ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు♪. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది♪.
అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుంది♪.
మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా తెలుసుకొన్నది.
1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
2. విదియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.
3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
4. చవితి రోజు శ్రాధ్ధము పెడితే పగవారు (శతృవులు) లేకుండా చేయును.
5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యములు కలుగజేయును.
6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనీయులుగా చేయును
7. సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్టికి నాయకునిగా చేయును.
8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.
9. నవమి మంచి భార్యను సమ కూర్చును. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతురాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.
10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.
11. ఏకాదశి రోజున సకల వేదవిద్యా పారంగతులను చేయును.
12. ద్వాదశి రోజున స్వర్ణములను , స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.
13. త్రయోదశి రోజున సత్సంతానాన్ని , మేధస్సును, పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.
14.చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని (ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును
16పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరిపూర్ణతను చేకూర్చును.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.
ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు , అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు.
శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
0 Response to "How to put the Mahalaya Squads?"
Post a Comment