Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postal Ballot details and application forms ll General elections-2019 ll ఎలక్షన్స్-2019

Postal Ballot details and application forms ll General elections-2019 ll ఎలక్షన్స్-2019
ఎన్నికల విధులలోవున్న అధికారులందరూ పోలింగ్ స్టేషన్ కు వెళ్ళి ఓటు వేసుకోలేరు. అందుకే ఓటరుగా నమోదైన అధికారులందరకూ పోస్టల్ బ్యాలట్ ఇవ్వడం జరుగుతుంది.
వినియోగించేది వీరే..
సాధారణ ఎన్నికల్లో సుమారు ఐదు రకాల వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఎన్నికల సిబ్బంది, సర్వీసు ఓటర్లు, ప్రత్యేక ఓటర్లు, నోటిఫైడ్ ఓటర్లు, నివారణ, నిర్బంధ ఓటర్లు.
           ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. POలు, APOలు, మిగతా పోలింగ్ సిబ్బంది, సెక్టోరిరియల్ ఆఫీసరులు, DEOలు, మైక్రో ఆబ్జర్వరులు, Fy, VST, VVT, MCC, Expenditure Teams, ROలు, ARO లు, వారి కార్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది, పోలిస్ సిబ్బంది, డ్రైవర్లు, క్లీనరులు, వంటవారు, వీడియో గ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫర్లు, వెబ్ కాస్టింగ్ నిర్వహణ సిబ్బంది ఇలా ఎన్నికల విధులలోవున్న వారందరికి postal ballot అందచేయడం జరుగుతుంది.
Postal Ballot details and application forms ll General elections-2019 ll ఎలక్షన్స్-2019

         ప్రోక్సీ ఓటింగ్లు ఎంపిక చేసుకోకుండా మినహాయించుకున్న సాయుధ రక్షక భటులు, ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సాయుధ బలగాలు సెక్షన్-60 ఆర్డీ యాక్టు 1950, సాయుధ బలగాల సభ్యులను సెక్షన్-46 ఆర్డీ యాక్టు 1950 ప్రకారం సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. వీరితోపాటు విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ పోస్టల్ విధానం ద్వారా ఓటేయొచ్చు.
ప్రత్యేక ఓటర్లు
రాష్ట్రపతి కార్యాలయంలో పని చేస్తున్న వారు పోర్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు.
ప్రధాన ఎన్నికల సంఘం ప్రకటించిన నోటిఫైడ్ ఓటర్లు కూడా ఈ విధానంలో ఓటు వినియోగించుకోవచ్చు.
నివారణ(ప్రివెంటివ్), నిర్బంధం(డ్రిపెన్షన్)లో ఉన్న ఓటర్లు ఈ విధానం ద్వారా హక్కును వినియోగించుకోవచ్చు. వీరితోపాటు సర్వీసు ఓటర్ల ప్రత్యేక ఓటర్ల సతీమణులు కూడా ఈ విధానం ద్వారా తమ హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ కు వినియోగించే ఫారాలు

ఫారం-12 పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసే పత్రం
ఫారం-13ఏ ఓటరు ధ్రువీకరణ పత్రం
ఫారం-13బీ పోస్టల్ బ్యాలెట్ పెట్టాల్సిన లోపలి కవరు
ఫారం-13సీ వెలుపలి కవరు, రిటర్నింగ్ అధికారి తిరిగి పంపాల్సిన కవరు (ఇదే కవర్లో ఫారం-13బీ పోస్టల్ బ్యాలెట్ లోపలి కవరు, ఫారం-13ఏ ఓటరు డిక్లరేషన్ పెట్టాలి.)
ఫారం 13-డి ఓటరుకు సూచనలు, సలహాలు ఉంటాయి.

         అధికారులు నియామక ఉత్తర్వులతోపాటు ఫారం-12 దరఖాస్తు పత్రం ఇస్తే.. అందులో పూర్తి వివరాలు నింపి రిటర్నింగ్ అధికారి కేంద్రం (ఫెసిలిటేషన్ సెంటర్)లో సమర్పించాలి. సదరు సిబ్బంది అదే రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉంటే వెంటనే పోప్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ ఆర్వో పరిధిలో లేకుంటే రిజిష్టర్ పోస్ట్ ద్వారా లేదా సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ ను పూర్తి వివరాలతో నింపి సరైన పత్రాలు జత చేసి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఉన్న డ్రాప్ బాక్సులో వేయాలి. లేదా సంబంధిత ఆర్వోకు నిర్దిష్ట సమయంలో చేరేటట్లు పోస్ట్ ద్వారా పంపించవచ్చు.

( Assembly / Parliament లకు వేరు వేరుగా apply చేయాలి.)
https://electoralsearch.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postal Ballot details and application forms ll General elections-2019 ll ఎలక్షన్స్-2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0