Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Public Exams 2019- Guidelines and instructions -పది పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు

SSC Public Exams 2019- Guidelines and instructions -పది పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు


SSC Public Exams 2019- Guidelines and instructions -పది పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు


 🔸ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వ హణపై విద్యాశాఖ పలు సూచనలను, మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకన నిర్వహణలపై ఆదేశాలు జారీ చేసింది.

 🔹ప్రతీ మూడురోజులకొకసారి ఇన్విజి లేటర్లను రొటేషన్‌ పద్ధతిన మార్చాలని అధికారులు ఆదేశిం చారు.


 🔸ప్రభుత్వపాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆశ్రం పాఠశాలలు, మునిసిపల్‌, అప్పర్‌ప్రైమరీ, ఎయిడెడ్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌లు, లాం గ్వేజ్‌ పండిట్‌ల సేవలను కూడా పరీక్షల విధులకు విని యోగించుకోవాలని సూచిం చారు. సంబంధిత సబ్జెక్టుల పరీ క్షలు జరిగే రోజుల్లో ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయు లకు ఇన్వి జిలేషన్‌ విధులు కేటాయించవద్దని ఆదేశించారు. ఇన్విజి లేషన్‌ విధులకు వ్యాయామోపాధ్యాయులు, క్రాఫ్ట్‌టీచర్ల కు, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ టీచర్ల సేవలను కూడా వినియోగిం చుకోవాలన్నారు. వీరందరి నియామకాలు పూర్తయిన తర్వాత ఇంకా ఇన్విజిలేటర్లకు కొరత ఉంటే సెకండరీగ్రేడ్‌ టీచర్లను ప్రాధాన్యతా క్రమంలో నియ మించుకోవచ్చని సూచించారు.

🔹ఒకే పాఠశాలలో ఆరు గురు ఎస్జీటీలు పనిచేస్తుంటే వారిలో నలుగురిని ఇన్వి జిలేషన్‌ విధులకు నియమించాలన్నారు.

 🔸ఇద్దరు ఉంటే ఒకరిని నియమించాలన్నారు.

 🔹ఆనందలహరి అభ్యసన (అల) పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఇన్విజి లేషన్‌ విధులు కేటాయించవద్దని స్పష్టం చేశారు.

🔸సింగిల్‌ టీచర్‌ ఉన్న ప్రాఽథమిక పాఠశాలల నుంచి ఇన్విజిలేషన్‌ విధు లకు ఉపాధ్యాయుడిని కేటాయించవద్దన్నారు.

🔹సెల్ఫ్‌ సెంటర్‌లుగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో అదే పాఠ శాలల నుంచి టీచర్లను సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్‌, క్లర్క్‌ విధులకు నియమించవద్దన్నారు.

హాల్‌టిక్కెట్ల పంపిణీ ప్రారంభం


🔸పదోతరగతి పరీక్షార్ధులకు హాల్‌టిక్కెట్ల పంపిణీ ప్రారంభమైంది. స్కూల్‌ హెచ్‌ఎంలు నామినల్‌రోల్స్‌, హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, వాటిపై అటెస్టేషన్‌ చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ఆ మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లు విద్యార్ధులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేముందు పరీక్షా కేంద్రం నామినల్‌ రోల్‌, ఫొటో అటెండెన్స్‌ షీట్లలో ఉన్న వివరాలను సరి పోల్చుకున్న తర్వాతే అనుమతించాలని ఆదేశించారు.

11న పరీక్షల ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్సు


🔹పది పరీక్షలకు నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీడియోకాన్ఫరెన్సును నిర్వహిస్తు న్నారు. కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా ట్రజరీ అధికారి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో, తపాలా కార్యా లయాల సూపరింటెండెంట్‌, జిల్లా స్థాయి పరిశీల కులు, జేడీలు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్లు, డీవైఈవోలు, ఎంఈవోలు హాజరవుతారు. ఇదే సమ యంలో ఆయా మండలాల్లో పరీక్షాధికారులు టెలి కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు అందుబాటులో ఉంటారు.

🔸ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు..

🔹పది పరీక్షలు జరిగే ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను అమర్చాలని మార్గదర్శకాల్లో సూచించారు. సీసీ కెమెరాలను అమర్చినప్పటికీ సంబంధిత పాఠశాలల కరస్పాం డెంట్‌లు/హెచ్‌ఎంల మొబైల్‌ ఫోన్లకు లింక్‌ లేకుండా చూడాలన్నారు. పరీక్షార్థుల మధ్య బెంచీలలో ఒక్కొక్కరికి కనీస దూరం మూడు అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. ప్లయింగ్‌స్క్వాడ్‌లు, సిట్టింగ్‌స్క్వాడ్‌ల బృందాలు తమతమ మొబైల్‌ ఫోన్లను తొలుత పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో అందజేసిన తర్వాత మాత్రమే తనిఖీలకు వెళ్ళాలని సూచించారు. మూల్యంకన ప్రక్రియను షామియానాల కింద నిర్వహించరాదని, అన్ని వసతులు ఉన్న కేంద్రాల్లో మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Public Exams 2019- Guidelines and instructions -పది పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0