Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What do we do on before Election day and Election day ఉద్యోగులకు ఎన్నికల విధివిధానాలు

What do we do on before Election day and Election day ఉద్యోగులకు ఎన్నికల విధివిధానాలు


పోలింగ్‌కు ఒక రోజు ముందు (ఏప్రిల్‌ 10న)

👉 పోలింగ్‌ సామగ్రి డిస్పాచ్‌ కేంద్రానికి ఉదయం 7 గంటలకు చేరుకోవాలి.

👉 నోటీసు బోర్డులో తమ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవాలి.

👉 సంబంధిత షామియానా వద్దకు చేరుకుని సెక్టోరల్‌ అధికారికి రిపోర్టు చేయాలి.
What do we do on before Election day and Election day ఉద్యోగులకు ఎన్నికల విధివిధానాలు


👉 అనుబంధం 19 ప్రకారం 56 సామాన్లు ఉన్నవో లేదో చూసుకోవాలి.

👉 ఎలక్టోరల్‌ రోల్‌ మార్క్‌డ్‌ కాపీలు ఆర్వో, ఏఆర్వో సంతకంతో ఉండాలి.

👉లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు రెండు సెట్ల ఈవీఎంలు (సీయూ, బీయూ, వీవీ ప్యాట్‌) తీసుకోవాలి.

👉 రెండు బ్యాలెట్‌ యూనిట్లలో అభ్యర్థుల పేర్లు సరిగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి.

👉 రెండు కంట్రోల్‌ యూనిట్లలో బ్యాటరీలను చెక్‌ చేసుకోవాలి.

👉 వీవీ ప్యాట్‌ను మాక్‌ పోలింగ్‌ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్‌ చేయకూడదు.

👉 పోలింగ్‌కు ముందురోజే సిబ్బందితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని అక్కడే నిద్రించాలి.

👉స్థానికుల ఆతిథ్యం స్వీకరించకూడదు.

👉పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్లను పరిశీలించి ఆధీనంలోకి తీసుకోవాలి.

👉పోలింగ్‌ కేంద్రంలో నాయకుల చిత్రాలు, ఎన్నికల గుర్తులు, నినాదాలుంటే తొలగించాలి.

 👉పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వేర్వేరు దారులుండేలా చేయాలి. ఒకే దారి ఉంటే బారికేడ్‌ ఏర్పాటు చేయాలి.

 👉ప్రిసైడింగ్‌ అధికారి, సహాయ ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ అధికారులకు, ఏజెంట్లకు సరిపడా బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేయాలి.

👉 పోలింగ్‌ కేంద్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు వేర్వేరు కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలి.

👉 రహస్య ఓటింగ్‌ కోసం ఓటింగ్‌ కంపార్టుమెంట్‌ లోపల ఎవరికీ కనిపించని విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి.

 పోలింగ్‌ నిర్వహించే రోజున (ఏప్రిల్‌ 11న)

👉6 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభానికి సిద్ధం కావాలి.

👉 6 గంటలకు పోలింగ్‌ ఏజెంట్లను తనిఖీ చేసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించి, ప్రవేశ పాస్‌ ఇచ్చి పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలి.

👉 ఏజెంట్లను చరవాణులు, ఎలక్ట్రానిక్‌ గడియారాలు, కండువాలు, టోపీలతో అనుమతించకూడదు.

👉లోక్‌సభ, శాసనసభ ఈవీఎంలకు వేర్వేరుగా నమూనా పోలింగ్‌ నిర్వహించాలి.

👉 ఏజెంట్లతో నమూనా పోలింగ్‌ నిర్వహించాలి.ఏజెంట్లు లేకపోతే సిబ్బందితోనే ఓటింగ్‌ వేయించాలి. వాటి ఫలితాలను ఏజెంట్లకు చూపించాలి.

👉 అనంతరం ధ్రువపత్రాన్ని తయారుచేసి దానిపై సంతకం చేసి ఏజెంట్లతో సంతకాలు చేయించాలి.

👉 నమూనా పోలింగ్‌ సమయంలో సీయూ, బీయూ, వీఈప్యాట్‌ పనిచేయకపోతే వాటిని మార్చేసి మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలి.

👉ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభించాలి. ఏ కారణంగా చేతనైనా పోలింగ్‌ ప్రారంభంలో జాప్యం జరిగితే పై అధికారులకు నివేదించాలి.

👉 పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లు ప్రవేశించిన తరువాత ఒకటో పోలింగ్‌ అధికారి అతని పేరు, ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి.

👉రెండో పోలింగ్‌ అధికారి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై చెరగని సిరాతో గోరు చివరి నుంచి కణుపు వరకు గీసి ఓటరు రిజిస్టరులో సంతకం చేయించాలి.

👉 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి ముగ్గురు నుంచి నలుగురు ఓటర్లనే అనుమతించాలి.

👉ఒక మగ ఓటరును, ఇద్దరు మహిళా ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోనికి అనుమతించాలి.

👉 వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి ఓటుకు అనుమతించాలి.

👉పోలింగ్‌ ప్రారంభించిన తరువాత, బీయూ, సీయూ సరిగా పనిచేయకపోతే ఆ రెండింటితో పాటు వీవీ ప్యాట్‌ను మార్చాలి.

👉పోలింగ్‌ ప్రారంభమైన తరువాత వీవీప్యాట్‌ మొరాయిస్తే దాన్ని మాత్రమే మార్చాలి.

👉 సాయంత్రం 6 గంటలకల్లా పోలింగ్‌ ముగించి కేంద్రం ప్రధాన ద్వారాన్ని మూసేసి అప్పటి వరకు వరుస క్రమంలో ఉన్న వ్యక్తులందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలి.

👉 చివర ఓటు ముగిసిన తరువాత పోలింగ్‌ ముగిసిందని ప్రకటించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What do we do on before Election day and Election day ఉద్యోగులకు ఎన్నికల విధివిధానాలు"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0