Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Restoration of Government Schools

ప్రభుత్వ బడుల పునరుద్ధరణ!


ప్రభుత్వ పాఠశాలలంటే మూసేయడమే కానీ కొత్తవి తెరవడం అనే మాటే ఉండేది కాదు. ఇది గతం.. ప్రస్తుతం మంచిరోజులు వచ్చాయి. విద్యార్థులు లేరంటూ గతేడాది మూసేసిన కొన్నింటిని ఈ ఏడాది మళ్లీ తెరుస్తున్నారు.

Restoration of Government Schools


ప్రజలడిగితే తెరవమన్న కలెక్టర్‌    తగిన ఆదేశాలిస్తున్న డీఈవో


 జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3200 వరకు ఉన్నాయి. గత విద్యాసంవత్సరం లెక్కల ప్రకారం 2.90 లక్షల మంది విద్యార్థులు బడుల్లో చదువుతున్నారు. ప్రాథమిక స్థాయిలో పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం, ఆంగ్ల మాధ్యమ బోధన లేకపోవడం వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతూ వచ్చారు. దాంతో రానురానూ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతూ వచ్చింది. హేతుబద్ధీకరణ పేరుతో రెండేళ్ల కిందట చాలా పాఠశాలలు తొలగించారు. అక్కడ ఉండే విద్యార్థులను దగ్గర్లో ఉన్న బడిలో కలిపేశారు. అలా సుమారుగా 63కుపైగా పాఠశాలలు తగ్గిపోయాయి.

ఇటీవల మళ్లీ తెరిచేందుకు


గతంలో అనేక కారణాలతో మూసేసిన పాఠశాలలను తెరవాలని జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు భావించారు. ఎక్కడైనా బడిని తెరవాలని అక్కడి ప్రజలు కోరితే వెంటనే అనుమతులు ఇవ్వాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికే లింగపాలెం మండలంలోని లక్ష్మీపురం, రేగుళ్లపాడు, పెదపాడు మండలంలోని ఏపూరు, పెదవేగి మండలంలోని సీతాపురం, చింతలపూడి మండలంలోని శంకుచక్రపురం పాఠశాలలు తెరిచారు. భీమవరం మండలంలోని జొన్నలగరువు, నరసాపురం మండలంలోని బేతపూడి, పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు (చినపేట), మొగల్తూరు మండలంలోని మేళంవాని మెరక, కన్నాయగూడెం పాఠశాలలు తెరవాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవసరమైన చోట పాఠశాలలు తెరవడంతో దగ్గర్లో ఉన్న వాటి నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్య


ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వైకాపా ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తొలుత ప్రభుత్వ బడులకు మాత్రమే వర్తింప చేస్తుందని ప్రచారం జరగడంతో చాలా మంది ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపించారు. ఇలా ప్రైవేటు పాఠశాలల నుంచి జిల్యావ్యాప్తంగా 17వేల మంది చేరారని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. తరువాత అమ్మ ఒడి కార్యక్రమం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కొంతమంది వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తక్కువమందే ఉంటారని చెబుతున్నారు.

మళ్లీ పెంచేందుకు

మా ప్రాంతానికి పాఠశాలకు కావాలని ప్రజలు అడిగితే వెంటనే మంజూరు చేస్తున్నాం. ప్రజలు కావాలన్న చోట ఉదారంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే కొన్నింటిని పునరుద్ధరించాం. ఇంకా కొంతమంది ప్రతిపాదనలు పంపిస్తున్నారు. అవసరమైన ప్రతిచోట పాఠశాలలను పునరుద్ధరించనున్నాం. -

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Restoration of Government Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0