Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Census 2020

Census 2020

దేశమంతటా కొత్త జనాభా లెక్కల సేకరణ యజ్ఞం నిర్వహణకు రంగం 


మీ ఇంట్లో ఎందరో మీరే చెప్పండి
ఎవరి సమాచారం వారే ఆన్‌లైన్లో  నమోదు చేయొచ్చు
ఆ వివరాలతో ఇంటి వద్దకు  జనగణన సిబ్బంది

ప్రత్యేక యాప్‌ను  రూపొందించిన కేంద్రం జనాభా లెక్కల్లో  తొలిసారి ప్రయోగం

దేశమంతటా కొత్త జనాభా లెక్కల సేకరణ యజ్ఞం నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. తొలిసారి ప్రజలు ఎవరికి వారే ఆన్‌లైన్‌ ద్వారా యాప్‌లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయోగాత్మకంగా అవకాశం కల్పించబోతున్నారు. గతంలో జనగణన సిబ్బంది ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసేవారు. ఈసారీ అదే విధానం కొనసాగుతుంది. దాన్ని మరింత వేగంగా, పక్కాగా చేసేందుకు ప్రజల నుంచి నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా మొబైల్‌ యాప్‌లో వారి కుటుంబ వివరాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎలా అంటే..


పదేళ్లకోసారి జనాభా లెక్కలను ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తారు. గతంలో 2010-11లో దేశమంతా జనగణన జరిగింది. తిరిగి 2020-21లో పూర్తిచేయాలి. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి జనగణన 2010-11లో జరిగింది. రాష్ట్ర విభజన తరవాత తొలిసారి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా జనగణన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి జనగణన కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంది. ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

జనగణనలో తొలి దశ 


జనగణనలో తొలి దశ కింద దేశవ్యాప్తంగా కట్టడాలు, ఇళ్లు, భవనాలు, పాకలు ఇలా ప్రతీ ఒక్కదానిని లెక్కిస్తారు. దీంతో సమాంతరంగా 2020 జూన్‌-సెప్టెంబరు మధ్యకాలంలో ప్రతీ కుటుంబం వివరాలను నమోదు చేస్తారు. వీటిని సేకరించే సమయంలోనే ప్రతీ కుటుంబంలో ఒకరి సెల్‌ఫోన్‌ నంబరును సేకరిస్తారు. మొబైల్‌ యాప్‌ ద్వారా కుటుంబ వివరాలను ఇస్తామని ఆసక్తి చూపేవారి సెల్‌ఫోన్‌ నంబరుకు యాప్‌ లింకును జనాభా లెక్కల శాఖ పంపుతుంది. ఈ లింకును 2021 జనవరిలో పంపే అవకాశాలున్నాయి. దానిని డౌన్‌లోడ్‌ చేసుకుని 2021 ఫిబ్రవరిలోగా కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి.


వచ్చేనెలలోప్రయోగాత్మకంగా.

ఈ కార్యక్రమాన్ని 1పూర్తిస్థాయిలో జరిపే ముందు వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నారు.తెలంగాణ, ఏపీల్లో నిజామాబాద్‌, గుంటూరు జిల్లాలను ఇందుకు ఎంపిక చేయాలని తాజాగా ప్రతిపాదించారు. ఈ జిల్లాల్లో ఏదైనా ఒక పట్టణం, గ్రామంలో 150 ఇళ్ల బ్లాక్‌ను గుర్తించి అక్కడ ప్రయోగాత్మకంగా వివరాలు సేకరిస్తారు. అక్కడ ఎదురయ్యే లోటుపాట్లను సమీక్షించి వచ్చే ఏడాది సమగ్ర జనగణనకు వెళతారు. యాప్‌లో నమోదు చేసిన వివరాలను తీసుకుని సదరు వ్యక్తి ఇంటికి జనగణన ఉద్యోగి వచ్చి ఇంటి పెద్ద సంతకం సేకరిస్తారు. యాప్‌లో నమోదు చేసిన వివరాలు కచ్చితమేనా? కాదా? అన్నది పరిశీలిస్తారు. అవి నిర్ధరణ అయిన తరవాత తుదిరికార్డుల్లో కంప్యూటరీకరిస్తారు.కుటుంబాల లెక్కలన్నీ తేలిన తరవాత వ్యక్తిగత వివరాల గురించి సమాచారం సేకరిస్తారు. వృత్తి, ఎస్సీ, ఎస్టీ, మతం, భాష, విద్యార్హత తదితర అనేక అంశాల గురించి వివరాలు నమోదు చేస్తారు.

ఈ సేకరణ అంతా 2021 మార్చిలోగా పూర్తిచేయాలి. 

తరవాత వాటిని వివిధ విభాగాల కింద క్రోడీకరించి దశలవారీగా కేంద్రం విడుదల చేస్తుంది. జనాభా లెక్కల సేకరణ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారు. సాధారణంగా ఉపాధ్యాయులను ఈ క్రతువుకు వినియోగిస్తారు. అధికారికంగా లెక్కలను మాత్రం కేంద్రమే విడుదల చేస్తుంది. 2022 నాటికి ఈ వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Census 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0