Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

10th Class Exams New Pattern Subject wise, Question wise Marks allotted 2019-20 academic year

  • . టెన్త్‌ పరీక్షల్లో సమూల మార్పులు! 
  • పలు అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు, 20 శాతం అంతర్గత మార్కుల రద్దుతో ఇక 100 మార్కులకు ప్రశ్నపత్రాలు, బిట్‌ పేపర్‌ రద్దు, దాని స్థానంలో ఏకవాక్య సమాధానాల ప్రశ్నలు. 
  • ఇక రెండు పేపర్లలోనూ పాస్‌ మార్కులు తప్పనిసరి. 
  • రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. 
  • వీటికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం. 
  • రానున్న పరీక్షల్లో విద్యార్థులు 100 మార్కులకు (50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 
  • ఇంతకుముందు ప్రతి పేపర్‌లో పది మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో బిట్‌ పేపర్‌ ఉండగా దాన్ని రద్దు చేయాలని .

10th Class Exams New Pattern Subject wise, Question wise Marks allotted 2019-20 academic year

10th Class Hindi Subject New Exam Pattern 


  • ఇప్పటివరకు హిందీ (100 మార్కులు) మినహాయించి ఆయా సబ్జెక్టుల్లో 40 చొప్పున 80 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి.
  • సబ్జెక్టుకు 20 చొప్పున అంతర్గత మార్కులుండేవి. ఇక నుంచి హిందీ/ సంస్కృతం మినహాయించి ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పేపర్‌ను 40 మార్కులకు బదులు 50 మార్కులకు ఇవ్వనున్నారు. 
  • మార్కులు, ప్రశ్నలు పెరుగుతున్నందున కొన్ని పేపర్ల పరీక్ష సమయాన్ని కూడా మార్పు చేయనున్నారు.
  • హిందీ/సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఉంటుంది.


  • హిందీ/సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు.


నాలుగు భాగాలుగా 10 వ తరగతి   ప్రశ్నపత్రం



పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఒక్కో విభాగంలో ఎన్ని ప్రశ్నలు ఇవ్వనున్నారో ప్రశ్నపత్రం, బ్లూప్రింట్‌ను కూడా రూపొందించారు. ఈపాటికే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నా అనుమతి రానందున పాఠశాలలకు పంపలేదు.
ఒక్కో పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ప్రశ్నలు ఇస్తారు.


Part 1 :   

అర (1/2) మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. వీటికి ఒకే వాక్యం/పదంతో జవాబు రాయాలి. బిట్‌ పేపర్‌కు బదులుగా దీన్ని పెడుతున్నారు.

Part 2 :   

ఒక (1) మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వీటికి ఒకటి లేదా రెండు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 8 మార్కులు ఉంటాయి.

Part 3 :   

రెండు (2) మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. మూడు లేదా నాలుగు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 16 మార్కులు కేటాయించారు.

Part 4 :  

పెద్ద ప్రశ్నలు 5 ఉంటాయి. వీటికి ఎనిమిది నుంచి పది వాక్యాల్లో జవాబు రాయాలి. ఒక్కో దానికి నాలుగు (4) మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయించారు.

Note :

సమాధానాలు రాసేందుకు 12 నుంచి 16 పేజీలుండే బుక్‌లెట్‌ను రూపొందించి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. దీని ద్వారా మాస్‌ కాపీయింగ్‌ను నివారించొచ్చని భావిస్తున్నారు.

పేపర్ల వారీగా పాస్‌ మార్కులు


  • ఇప్పటివరకు పదో తరగతిలో ఆయా సబ్జెక్టుల్లోని రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వచ్చినా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణించేవారు.
  •  ఇక నుంచి సబ్జెక్టుల్లోని రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ ఉత్తీర్ణులవ్వాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ప్రతి పేపర్‌లోనూ 18చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
  • ఇలా రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. పాత విధానంలో ఒక పేపర్‌లో 35 మార్కులు వచ్చి, రెండో దానిలో సున్నా వచ్చినా పాసవుతున్నారు.
  •  దీనివల్ల విద్యార్థులు ఎందులో వెనుకంజలో ఉన్నారు.. ఏ సబ్జెక్టుల్లో ప్రమాణాలు ఉన్నాయి.. 
  • టీచర్లలో ఎవరు బాగా పాఠాలు చెబుతున్నారు.. ఎవరు చెప్పడం లేదు అనే విషయాలు తెలియడం లేదు. 
  • ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు.
  • NEW QUESTION PAPER PATTRUN (Non Language) Modal

English Question paper modal

DOWNLOAD BELOW

PAPER - 1 PAPER - II

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "10th Class Exams New Pattern Subject wise, Question wise Marks allotted 2019-20 academic year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0