Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ajit Kumar Doval, IPS (retired), Police Medal, PPM, KC (born January 20, 1945)

అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20)
భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు.2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు
Ajit Kumar Doval, IPS (retired), Police Medal, PPM, KC (born January 20, 1945)


తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం

  • డోవల్ 1945లో ఘర్వాలీ బ్రాహ్మణ కుటుంబంలో యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుత ఉత్తరాఖండ్)కు చెందిన ఘర్వాల్ప ప్రాంతంలోని గిరి బనేల్సున్ గ్రామంలో జన్మించారు. 
  • డోవాల్ తండ్రి సైన్యంలో పనిచేశారు.
  • అజిత్‌ కుమార్‌ దోవల్‌... 1968 బ్యాచ్‌ కేరళ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. 
  • సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌. 
  • 23 ఏళ్లకే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. 
  • ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు

పోలీస్ ఉద్యోగం

  • దోబాల్ 1968లో కేరళ క్యాడర్ లో ఐపీఎస్ లో చేరారు. పంజాబ్, మిజోరంలలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలుపంచుకున్నారు.
  •  1999లో కాందహార్లో చిక్కుకున్న భారత ఐసీ-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధానకర్తల్లో దోభాల్ ఒకరు.
  • ప్రత్యేకించి 1971-1999 మధ్య జరిగిన 15 భారత విమానాల అపహరణల నుంచి ప్రయాణికుల్ని విడిపించే వివిధ చర్యలు అన్నిటిలోనూ పాల్గొని అనుభవం గడించడం విశేషం.
  • ఇంటిలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల విభాగాన్ని దాదాపు దశాబ్ది కాలం నడిపించడమే కాక మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎం.ఎ.సి.), సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ (జేటిఎఫ్ఐ)లకు సంస్థాపక ఛైర్మన్ గా పనిచేశారు.

నిఘా విభాగంలో

మిజో నేషనల్ ఫ్రంట్ (ఎం.ఎన్.ఎఫ్.) తిరుగుబాటు సమయంలో లాల్డెంగా నాయకులు ఏడుగురులో ఆరుగురిని తనవైపు డోవల్ తిప్పుకోగలిగారు.  He spent long periods of time incognito with the Mizo National Army in the Arakan in Burma and inside Chinese territory. From Mizoram, Doval went to Sikkim where he played a role during the merger of the state with India

సేవలు,ఆపరేషన్లు

సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు మారారు దోవల్‌.
అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.
తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారీయన.

మిజో నేషనల్ ఆర్మీ పతనం

  • 1980ల్లో మిజో నేషనల్‌ ఆర్మీ (ఎమ్‌ఎన్‌ఏ)లో ఒకరిగా చేరి మయన్మార్‌, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో ఎమ్‌ఎన్‌ఏ అధినేత బైక్చ్‌చుంగాకు ఎంతో సన్నిహితుడు అయ్యాడు
  • ఒక దశలో ‘దోవల్‌ మాటల్ని వింటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంద’ని వారి నాయకుడు లాల్డెంగా ఆ అధినేతను హెచ్చరించాడట. 
  • కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్డెంగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘దోవల్‌వల్లనే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. 
  • నా కింద ఏడుగురు మిలటరీ కమాండర్స్‌ ఉండేవారు. వారిలో ఆరుగురిని దోవల్‌ నా నుంచి దూరం చేశారు’ అని లాల్డెంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 
  • అలా 20 ఏళ్లపాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎమ్‌ఎన్‌ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్‌.
  •  చాలామంది తమ కెరీర్‌ మొత్తంలో చేయలేని పనిని దోవల్‌ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కితాబిచ్చారు. 
  • ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ను అందుకున్న పిన్న వయస్కుడు దోవల్‌.

ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌

  • 1988 ప్రాంతంలో ‘ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌’ పేరుతో స్వర్ణదేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్‌ని ప్రభుత్వం చేపట్టినపుడు దోవల్‌ కీలక పాత్ర పోషించారు. 
  • ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్థాన్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నారు. 
  • ఆపరేషన్‌ నిర్వహణకు కొద్ది రోజులు ముందు స్వర్ణదేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యా బలం, బలగాల మోహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతాదళాలకు అందించారు. 
  • సైన్యం ఆ ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో స్వర్ణదేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా.
  •  దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్‌ పూర్తిచేయగలిగింది. ‘తీక్షణమైన పరిశీలనా శక్తి, అంతుచిక్కని నవ్వు...’ దోవల్‌ ప్రత్యేకతలని చెబుతారు 
  • ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ నిఘా అధికారి. 
  • ఆ ఆపరేషన్‌కుగానూ దోవల్‌ ‘కీర్తి చక్ర’ అవార్డుని అందుకున్నారు. సైన్యంలో పనిచేసేవారికే అప్పటివరకూ ఆ అవార్డు ఇచ్చేవారు. 
  • దోవల్‌ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీసు అధికారి.

పాక్‌లో ఏడేళ్లు

  • 90ల్లో ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్‌ కశ్మీర్‌లో అడుగుపెట్టారు. 
  • వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రయ్‌ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారుచేశారు. 
  • తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రయ్‌. 
  • ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. 
  • మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. 
  • రాజకీయంగానూ అదో కీలక మలుపు. 
  • ఆ చర్యలతో 1996లో జమ్ము, కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. 
  • ఆ సమయంలో దిల్లీ వర్గాలు దోవల్‌ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. 
  • కొన్నిసార్లు ఆయన్ని విమర్శించినవారు కూడా ఆ విజయంతో ప్రశంసించారు. 
  • అంతవరకూ గూఢచారిగా పేరుతెచ్చుకున్న దోవల్‌... వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు. 
  • ఈశాన్య భారత్‌, పంజాబ్‌, కశ్మీర్‌... భారత్‌ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాసరే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడానికి తన ప్రతిభాపాటవాల్ని ఉపయోగించేవారు దోవల్‌. అంతేకాదు, ఏడేళ్లపాటు పాకిస్తాన్‌లో గూఢచారిగానూ ఉన్నారు. 
  • లాహోర్‌లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్‌. 
  • ఆ సమయంలో పాక్‌తోపాటు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ అనుకూల ఏజెంట్‌లను నియమించారు. 
  • ఓసారి లాహోర్‌లో బయటకు వెళ్లినపుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి దోవల్‌ను చూసి ‘నువ్వు హిందూ కదా!’ అని అడిగాడట. 
  • కాదని దోవల్‌ సమాధానమిచ్చినా తనతో రమ్మని రెండు మూడు సందులు తిప్పి తన గదికి తీసుకొని వెళ్లాడట ఆ వ్యక్తి. ‘నువ్వు కచ్చితంగా హిందూవే’ అని చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నావని దోవల్‌ ప్రశ్నిస్తే, ‘నీ చెవికి కుట్టు ఉంది.
  •  ఈ సంప్రదాయం హిందువులదే. అలా బయట తిరగకు. 
  • దానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకో.
  •  నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావు, నేను కూడా హిందువునే’ అని చెప్పి, తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలు చూపించాడట. 
  • తన కుటుంబాన్ని అక్కడివారు పొట్టన పెట్టుకున్నారనీ, తాను వేషం మార్చి బతుకుతున్నాననీ దోవల్‌తో చెప్పాడట అతడు. 
  • తర్వాత కొన్నాళ్లు లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు దోవల్‌. 
  • క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే, ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టడం దోవల్‌కు వెన్నతో పెట్టిన విద్య.
VIDEO-I


VIDEO-II


VIDEO-III



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ajit Kumar Doval, IPS (retired), Police Medal, PPM, KC (born January 20, 1945)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0