Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You can change the photo above your Aadhaar. There are two ways of doing this

ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

 మీ ఆధార్‌ పైన ఉన్న ఫోటోను మార్చుకోవచ్చు. ఇందుకోసం రెండు మార్గాలున్నాయి.
You can change the photo above your Aadhaar. There are two ways of doing this

ఆధార్ కార్డులో ఫోటో మార్చడానికి మొదటి మార్గం



  • UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • మీ వివరాలతో ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ నింపాలి.
  • ఆ ఫామ్ తీసుకొని దగ్గర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.
  • ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ సిబ్బందికి దరఖాస్తు ఫామ్‌తో పాటు బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • మీ వివరాలను పోల్చి చూసిన తర్వాత మీ లేటెస్ట్ ఫోటోను తీసుకుంటారు ఎన్‌రోల్‌మెంట్ సిబ్బంది.
  • మీ ఫోటో అప్‌డేట్ చేయడానికి రూ.25+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
  • అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్‌(URN)తో ఉండే ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ తీసుకోవాలి.
  • మీ ఆధార్ అప్‌డేట్ స్టేటస్‌ను URN ద్వారా చెక్ చేసుకోవచ్చు.


ఆధార్ కార్డులో ఫోటో మార్చడానికి రెండో మార్గం


  • ఒకవేళ మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లే అవకాశం లేకపోతే UIDAI కార్యాలయానికి లెటర్ రాసి ఫోటో అప్‌డేట్ చేయొచ్చు.
  • UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆధార్ డేటా అప్‌డేట్ కరెక్షన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • మీ వివరాలన్నీ ఆధార్ డేటా అప్‌డేట్ కరెక్షన్ ఫామ్‌లో రాయాలి.
  • మీ ఆధార్ ఫోటో మార్చాలని కోరుతూ UIDAI రీజనల్ కార్యాలయానికి దరఖాస్తు రాయాలి.
  • దరఖాస్తు ఫామ్‌తో పాటు కొత్త ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ జత చేయాలి.
  • ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత మీ అడ్రస్‌కు 15 నుంచి 20 రోజుల్లో కొత్త ఆధార్ కార్డ్ వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You can change the photo above your Aadhaar. There are two ways of doing this"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0