Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you would like to buy a new phone, follow the instructions below

కొత్త ఫోన్ కొన్న వెంటనే చేయాల్సిన 6 పనులు ఇవి!
new android phone configure settings
ముచ్చటపడి కొత్త ఫోన్ కొన్నంత మాత్రాన సరిపోదు.  కొన్న వెంటనే ప్రధానంగా కొన్ని విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
If you would like to buy a new phone, follow the instructions below

బ్యాకప్

  • మీ ఫోన్ సెట్టింగ్స్, కాల్ లాగ్స్, SMSలు, యాప్స్ లిస్ట్ వంటివన్నీ  ఆటోమేటిక్గా బ్యాకప్ అయ్యేలా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. 
  • సహజంగా ఆండ్రాయిడ్ ఫోన్ సెటప్ చేసే సమయంలో  Google అకౌంట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. 
  • చాలామంది దీని గురించి అర్థం కాక వదిలేస్తుంటారు.  అయితే కచ్చితంగా బ్యాకప్ ఎనేబుల్ చేసుకోవడం మంచిది. 
  • ఎప్పుడైనా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమైన డేటా మళ్లీ వెనక్కి సులభంగా తీసుకురావడం కోసం ఇది ఉపయోగపడుతుంది.

పాస్వర్డ్ మేనేజర్

  • ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం password managerలను సపోర్ట్ చేస్తున్న తరుణంలో,  తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న ఫోన్లో Last Pass వంటి ఏదైనా పాస్వర్డ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది.  
  • ముఖ్యమైన పాస్వర్డ్‌లు ఆటో-ఫిల్ చేసుకోవడం కోసం, అలాగే అవసరమైనప్పుడు కొత్త పాస్వర్డ్‌లు సృష్టించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది.

కొత్త ఫీచర్లు పరిశీలించండి

  • సహజంగా ప్రతి కొత్త ఫోన్లోనూ  అనేక రకాల సరికొత్త సదుపాయాలు పొందుపరచబడి ఉంటాయి.
  •   అవేంటో తెలుసుకుని, వాటిని ఒక దాని తర్వాత మరొకటి స్వయంగా పరిశీలిస్తూ పోతే,  వాటిలో మీకు ఉపయోగపడేవి ఉంటే ఆ ఫోన్ ద్వారా కచ్చితంగా పూర్తిస్థాయి ప్రయోజనం పొందవచ్చు.

 ఏంటీవైరస్ వేయకండి

  • చాలా మంది కంప్యూటర్ లో వాడినట్లు,  ఫోన్ కొన్న వెంటనే Google ప్లే స్టోర్ నుండి ఏదో ఒక యాంటీవైరస్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు.  
  • ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రత్యేకంగా యాంటీవైరస్ అవసరం లేదు. గూగుల్ సంస్థ Google Play Protect వంటి అనేక శక్తివంతమైన ఆప్షన్లను గూగుల్ ప్లే సర్వీసెస్ లో భాగంగా మన ఫోన్ కి అందిస్తూ ఉంటుంది.  
  • అంతకు మించి ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఇలా థర్డ్-పార్టీ యాంటీవైరస్‌లను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే పరోక్షంగా ఫోన్ స్లో అవుతుంది కూడా!

మరీ ఎక్కువ యాప్స్


  • కొత్త ఫోన్ కొనుగోలు చేసిన మోజులో అనేకమంది వెనకా ముందు ఆలోచించకుండా కనిపించిన ప్రతి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. 
  •  దీని వల్ల పరోక్షంగా ఫోన్ స్లో అవుతుంది. మీకు బాగా అవసరమైన ముఖ్యమైన అప్లికేషన్లు మాత్రమే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మిగిలిన వాటికి దూరంగా ఉండండి.

హోమ్ స్క్రీన్

  • మీరు తరచుగా వాడే అప్లికేషన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా హోమ్ స్క్రీన్‌లో ఐకాన్లుగా అమర్చుకోండి.  
  • ఒకవేళ మీకు కావలసిన అప్లికేషన్లను పెద్ద మొత్తంలో ఉంటే, హోమ్ స్క్రీన్లో ఫోల్డర్లు క్రియేట్ చేసుకుని, అందులో కావలసిన అన్ని యాప్స్ కి సంబంధించిన ఐకాన్లు  అమర్చుకోండి. 
  • అలాగే కొన్ని రకాల అప్లికేషన్స్ widgets రూపంలో కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ ఉంటాయి.
  •  ఉదాహరణకు వాతావరణానికి సంబంధించిన widgets లాంటివి.  
  • మీ అవసరాన్ని బట్టి ఇలాంటి వాటిని కూడా హోమ్ స్క్రీన్‌లో అమర్చుకోండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you would like to buy a new phone, follow the instructions below"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0