Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Article 370 repealed and partition of Jammu and Kashmir

Article 370 repealed and partition of Jammu and Kashmir
Article 370 repealed and partition of   Jammu and Kashmir

ఆర్టికల్ 370 రద్దు మరియు జమ్ము కశ్మీర్  విభజన 

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు అలాగే 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించగా.. ఆ వెంటనే రాష్ట్రపతి కార్యాలయం నుంచి దీన్ని రద్దు చేస్తూ గెజిట్ విడుదలైంది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి దీనిపై ప్రకటన చేసిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. గెజిట్ విడుదల చేశారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి  స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్‌ 370(3)తో జమ్ముకశ్మీర్‌ లెజిస్లేటీవ్‌ అసెంబ్లీగా మారుతుంది. దీంతో జమ్ముకశ్మీర్‌  అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది.
Article 370 repealed and partition of Jammu and Kashmir


రాష్ట్ర విభజన..

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది.

ఆర్టికల్ 370 ఏం చెబుతోంది

రాజ్యాంగం ప్రకారం జమ్మూకాశ్మీర్ రాష్ర్టానికి ఆర్టికల్‌ 370 స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ భాగంలో దీన్ని పొందుపరిచారు. దేశంలోని మిగతా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు.
ఆర్టికల్‌ 370 ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగతా చట్టాల అమలు కోసం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం అనుమతి తెలిపినప్పుడు మాత్రమే పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను అమలవుతాయి. అంటే ఈ ఆర్టికల్‌ ప్రకారం.. కశ్మీర్‌ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తున్నారన్నది అర్థమవుతోంది. ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది.
ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్‌ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. కశ్మీర్‌ భూభాగాల మార్పుపై కూడా పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది.

35ఏ ఆర్టికల్‌ ఏం చెబుతోంది

జమ్ముకశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని 35ఏ ఆర్టికల్‌ నిర్వచిస్తుంది. వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది. 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌–35ఏను చేర్చారు. 35ఏ ప్రకారం..
1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చవచ్చు. కశ్మీరు మహిళ ఇతర రాష్ట్రాల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. ఆమెకు ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండడానికి వీల్లేదు. ఆమె పిల్లలకు కూడా ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికేట్‌ ఇ‍వ్వరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Article 370 repealed and partition of Jammu and Kashmir"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0