Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news: a huge advantage to taxpayers ..

గుడ్ న్యూస్: పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. మారనున్న ట్యాక్స్ శ్లాబులు!
కేంద్రం ఆదాయపు పన్ను చట్టాల బూజుదులిపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన టాక్స్ ఫోర్స్ కమిటీ తాజాగా నిర్మలా సీతారామన్‌కు నివేదిక సమర్పించింది. ఇందులో ట్యాక్స్ శ్లాబ్స్ మార్పు, పలు Iపన్నుల ఎత్తివేత వంటి అంశాలున్నాయి.
Good news: a huge advantage to taxpayers ..

ప్రధానాంశాలు:


  • వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్‌ల మర్పునకు ట్యాక్స్ ఫోర్స్ సిఫార్సు
  • పలు ట్యాక్స్‌ల ఎత్తివేతకు సూచనలు
  • సర్ చార్జ్ కూడా తొలగించాలని సూచన
  • నివేదికను నిర్మలా సీతారామన్‌కు అందజేసిన కమిటీ
  • ఆదాయపు పన్ను చెల్లించే వారికి తీపికబురు అందబోతోంది.
  •  ఏడాదికి రూ.5 లక్షలు-రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. 
  • కేంద్రం ప్రత్యక్ష పన్నులపై ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ట్యాక్స్ ఫోర్స్ కమిటీ ఈ సిఫార్సు చేసింది. 
  • మోదీ సర్కార్ కమిటీ ప్రతిపాదనలకు ఓకే చెబితే ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను పోటు తగ్గనుంది.
  • కమిటీ అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్స్‌లోనూ మార్పులు సూచించింది. 
  • రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారిపై ట్యాక్స్‌ 20 శాతానికి తగ్గించాలని పేర్కొంది.
  • ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ ఆదాయం ఉన్న వారిపై 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారిపై 20 శాతం, రూ.10 లక్షలు పైన ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్ను ఉంది. ప్రస్తుత పన్ను శ్లాబ్స్‌కు ప్రత్యామ్నాయంగా 5 శాతం, 10 శాతం, 20 శాతం, 30 శాతం, 35 శాతం పన్ను శ్లాబ్స్‌ను కమిటీ సూచించింది.
  • ఇకపోతే ఇప్పుడు కూడా రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  •  చెల్లించిన పన్ను రిబేట్ రూపంలో మళ్లీ వెనక్కు పొందొచ్చు. 
  • 2019 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే అంశాన్ని వెల్లడించారు.

పన్ను సిఫార్సులు ఇలా..



ఆదాయం టాస్క్ ఫోర్స్               ప్రతిపాదనలు

రూ.2.5 లక్షల వరకు               ఎలాంటి పన్ను లేదు
రూ.5 లక్షల వరకు               రిబేట్ ప్రయోజనం
రూ.2.5 లక్షలు-రూ.10 లక్షలు 10 శాతం పన్ను
రూ.10 లక్షలు-రూ.20 లక్షలు 20 శాతం పన్ను
రూ.20 లక్షలు- రూ.2 కోట్లు        30 శాతం పన్ను
రూ.2 కోట్లు- ఆపైన                 35 శాతం పన్ను

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం టస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఆగస్ట్ 19న తన నివేదికను నిర్మలా సీతారామన్‌కు అందజేసింది. అయితే ఈ నివేదికలోని అంశాలను ప్రభుత్వం ఇంకా బయటకు వెల్లడించలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news: a huge advantage to taxpayers .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0