Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health cards will be issued to each family


  • కుటుంబానికో ఆరోగ్య కార్డు
  • ప్రయోగాత్మకంగా ప.గో.జిల్లాలో రూ.1000 ఆరోగ్యశ్రీ సేవల వర్తింపు
  • నవంబరు నుంచి పొరుగు రాష్ట్రాల్లో వైద్యసేవల కొనసాగింపు
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2000 సేవలు
  • ఆసుపత్రుల్లో ‘వైఎస్సార్‌ క్యాంటీన్లు
  • వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం


ఈనాడు, అమరావతి:* ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డులను జారీచేయనున్నారు. డిసెంబరు 21 నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని, అనుబంధ ఆసుపత్రులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని, నవంబరు నుంచి పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని, ప్రధాన ఆసుపత్రుల్లో ‘వైఎస్సార్‌ క్యాంటీన్లు’ ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 108, 104 వాహనాలు ఆరేళ్లకోసారి కొత్తవి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. వచ్చేనెలలో కొత్త వాహనాల కొనుగోళ్లకు టెండర్లు పిలవాలని సూచించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌ కార్తికేయ మిశ్రా, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున్‌, వైద్య సంస్కరణల కమిటీ ఛైర్‌పర్సన్‌ సుజాతారావు, సభ్యులు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం తదితరులు పాల్గొన్నారు.
Health cards will be issued to each family

క్యూఆర్‌’ కోడ్‌తో కార్డుల జారీ!

‘క్యూఆర్‌’ కోడ్‌తో జారీ అయ్యే కార్డులో ఎప్పటికప్పుడు నమోదుచేసే ఆరోగ్య వివరాలు గోప్యంగా ఉంచుతారు. కార్డు స్కాన్‌ చేయగానే సంబంధిత వ్యక్తికి ఓటీపీ వస్తుంది. కార్డుదారులు ఎవరైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు సులువుగా వైద్యులకు తెలుస్తాయి.ఫలితంగా రోగులకు సత్వరం మెరుగైన వైద్యసేవలు అందించే వీలుంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కార్యక్రమ పర్యవేక్షణ జరగనుంది.
ప్రయోగాత్మకంగా ‘రూ.1000’ ఆరోగ్యశ్రీ వర్తింపు
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలో ఇపుడున్న 1054 వైద్యసేవలను సుమారు 2వేలకు పెంచనున్నారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద చెల్లించే విధానాన్ని జనవరి ఒకటి నుంచి పశ్చిమ గోదావరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. దీనిపై 3నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం చేస్తుంది. ఫలితాలను అనుసరించి ఏడాదిలోగా మిగిలిన జిల్లాలకు వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


 వార్షికాదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారికి ‘ఆరోగ్యశ్రీ’ వర్తింపజేయనున్నారు.

నవంబరు నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని సుమారు 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించనున్నారు. ప్రధాన ఆసుపత్రుల్లో రోగులు, సహాయకుల కోసం మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండేలా ‘వైఎస్సార్‌ క్యాంటీన్లు’ ఏర్పాటుచేయనున్నారు. మందులు, రక్తపరీక్షల కోసం రోగులు ఆసుపత్రుల నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా నాణ్యమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచనున్నారు. పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

వైద్యసేవల విస్తృతి

విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కడప నగరాల్లోని ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సదుపాయాలతో క్యాన్సర్‌ వైద్యసేవలను విస్తరించేందుకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో, ప్రకాశం జిల్లా మార్కాపురంలో కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ రీసెర్చి ఆసుపత్రుల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. విజయనగరం, గుంటూరు జిల్లా గురజాల, విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాలల ఏర్పాటుకు సెప్టెంబరు, అక్టోబరు నెలలో శంకుస్థాపనలు జరగనున్నాయి. అక్టోబరు 10 నుంచి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకం కింద ప్రజలకు కంటి పరీక్షలను ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు అవసరమైన రోగులను గుర్తించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటారు.

అనుబంధ ఆసుపత్రులకు గ్రేడింగ్‌!

ఆరోగ్యశ్రీ కింద అనుబంధ ఆసుపత్రులకు శ్రేణులు కేటాయిస్తారు. ప్రమాణాలు పాటించే వాటిని ఎ+, ఎ కేటగిరిలో ఉంచుతారు. లోపాలున్న వాటిని ‘బి’ కేటగిరిలో ఉంచి తగిన చర్యలు తీసుకునేందుకు యాజమాన్యాలకు కొంత వ్యవధి ఇవ్వాలని, మళ్లీ తనిఖీ చేసినప్పుడు ఆ లోపాలు అలాగే ఉంటే అనుబంధ గుర్తింపును తొలగించాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ‘ఎ+’ కేటగిరిలోకి తీసుకురావాలని, 2020 నాటికల్లా బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులను, 2021 డిసెంబరు నాటికి 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య సంస్కరణల కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్‌కు వచ్చేనెల 11న అందజేయనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health cards will be issued to each family"

Post a comment