Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SREE SREE RAJA VASI REDDY GOPALA KRISHNA MAHESWARA PRASAD (Prajact PRASAD}

  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం 
  • ఏ మహానుభావుడో తెలుసా?
  • అయితే ఒక్క నిమిషం ఈ ఆర్టికల్ చదవండి.


పై ఫోటోలోని పుణ్యమూర్తిని రోజు స్మరించుకుందాం, వారి చిత్రపటానికి రోజూ నమస్కరించుకుందాం, కొంచెం కష్టపడి అయినా ఓపికగా వారి చరిత్ర చదువుదాం.

ఎందుకంటే ఆయన మహానుభావుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల లో మనం ఈ రోజు సుభిక్షం గా  పాడి పంటల తో ఉన్నామంటే వారే కారణం,వంశ పరం పర్యంగా వచ్చిన రాజరికంతో తృప్తి చెందలేదు.
తొలుత ఈయన కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి కృషిచేసారు.ఈ ప్రాజెక్టు ఇప్పటికీ తెలుగువారి కలగానే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది. తొలుత కృష్ణా పెన్నా నదులను సంధించుటకు తలపెట్టింది. ఇది తెలిసి ఈయన గారు ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. మాచెర్ల నుండి దట్టమయిన అడవులగుండా నందికొండ వరకు వెళ్ళి డాం నకు అనువైన స్థలము చూశారు

ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో, సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచే ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించారు. మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది వూరు వూరు తిరిగి రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ ని స్థాపించి నాగార్జున సాగర్ వద్ద( నంది కొండ వద్ద ) ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంకా ఉపయోగపడి ఆనీటితో పంటలు పండించుకుని కరువులు దూరం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి అయి తెలుగునేల అన్నపూర్ణగా, భారత దేశ ధాన్యగారంగా మారుతుందని తలంచి, అనకట్టలు ఆధునిక దేవాలయాలని భావించి బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదించి నాగార్జున సాగర్ నిర్మాణం పై పాలకుల దృష్టి పడేలా చేశారు.కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. 

ఈలోగా దేశానికి స్వాతంత్య్రం రావడంతో, కేంద్ర ప్రభుత్వం వద్దకు రైతులను పెద్ద సంఖ్యలో తీసుకెళ్లి గాంధీజీ గారికి నాటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు, పటేల్ దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ పరిశీలనకై ఒక ఖోస్లా కమిటీని నియమించింది.

ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా గారు ఢిల్లే వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేసిరి.అప్పటి ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేదిప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. 

కమిటీ సభ్యులు నందికొండకు కార్లు జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. దీని వెనుక ఎవరున్నారో వారికి పూర్తిగా  అర్ధమయింది. వారు వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చారు. కృష్ణమ్మ జల సిరిని చూపి ఆ కమిటీని ఒప్పించి

చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ నిర్మాణానికి పునాది రాయి వేయించి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించి దేశం లోని ఓ పెద్ద బహుళార్ధక ప్రాజెక్ట్ ను నిర్మింప జేసిన మహానుభావుడు.నిర్మాణ సమయములో ఆయన  గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. 1966 ఆగస్టు మూడున డాం నుండి నీరు వదిలారుఈ నాలుగు జిల్లాలో ప్రజలు ఈరోజు అన్నం తింటున్నారంటే ఆమహాను భావుని చలవే.
మహాను భావుడే గౌరవ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలక్రిష్ణ మహేశ్వర ప్రసాద్.ఈయనను ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. జగ్గయ్యపేట వద్ద గల ముక్త్యాల సంస్థనాధీశుడు, మనందరి దేవుడు మనం తినే ప్రతి మెతుకులో వీరిని స్మరించుకోవాలి, వీరి గాధ పిల్లలకు చెప్పండి, మిత్రులతో పంచుకోండి.ఆంధ్ర ప్రదేశ్ కు తలమానికమగు నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాదు గారు అహర్నిశలూ శ్రమించారు

నాగార్జునసాగర్ డాం ముక్త్యాల రాజావారి కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. కాని రాజావారి సేవలను తర్వాతి తరము వారు ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు గుర్తించలేదు సరిగదా పూర్తిగా మరచారు. రాజావారికి ఇందిరా దేవి అను కుమార్తె గలరు. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త, పూర్వ ఐ.సి.యస్ ఉద్యోగి వెలగపూడి రామకృష్ణ గారి కుమారుడు దత్తు గారిని పెండ్లాడారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SREE SREE RAJA VASI REDDY GOPALA KRISHNA MAHESWARA PRASAD (Prajact PRASAD}"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0