Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The main topics discussed at the EHS conference

 EHS  మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగినది.

 ఈ సమావేశంలో ఎంప్లాయిస్ హెల్త్  స్కీమ్(EHS) పేరు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గా మార్పు చెందింది.


ఈ సమావేశంలో చర్చించిన ప్రధానమైన అంశాలు:
The main topics discussed at the EHS conference

  •  హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
  •  గతంలో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను  క్యూఆర్ కోడ్ సిస్టంతో నూతన హెల్త్ కార్డులను జారీ చేయనున్నది. డేటాబేస్ తో అనుసంధానం చెందిన ఈ  న్యూ హెల్త్ కార్డుల వలన ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండును. 
  • ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అమలుకు సుమారు 400 కోట్లు ఖర్చవుతుంది.
  • 200 కోట్లు ప్రభుత్వం వాటా, 200 కోట్లు ఉద్యోగులు వాటా  ఇవ్వవలసి ఉంటుంది.
  • కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వద్ద నుండి 71 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నాము.  దీనికొరకు స్లాబ్ రేట్ల ప్రకారం కాకుండా కేటగిరీల వారీగా బేసిక్ పే ఆధారంగా నూతన స్లాబ్ రేట్లను తదుపరి స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు.
  • మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కింద 2700 క్లెయిములు పెండింగ్‌లో ఉన్న కారణంగా కేవలం విద్యా శాఖ నుండి 1784 క్లెయిములను స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఒక్క నెల రోజుల్లో పరిష్కారం చేస్తారు. తదుపరి వచ్చే క్లెయిమ్ లన్నీ కేవలం 21 రోజుల్లోనే క్లియర్ చేస్తామని తెలిపారు.
  • వన్ టైం హెల్త్ చెకప్ విషయంలో ప్రప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
  •  పెండింగ్‌లో ఉన్న గురుకుల, మోడల్, ఎయిడెడ్, గ్రంథాలయ మరియు డిప్యుటేషన్ పై పనిచేస్తున్న  ఉద్యోగులందరికీ హెల్త్ కార్డుల మంజూరు కై కార్యాచరణ చేపడతారు.
  • ఇప్పటి నుండి ప్రతి మూడు నెలలకోసారి మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తారు.
  • అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి మూడు నెలలకోసారి మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తారు.
  •  క్రానిక్ డిసీజ్ లకి LOC ల  మంజూరు కేవలం 3 రోజుల్లోనే విడుదల అయ్యే విధంగా కృషి చేస్తారు.
  • ఏదైనా హాస్పిటల్ వారితో సమస్యలు ఉంటే ఈ క్రింది మెయిల్ కు సంప్రదించిన ఎడల సీఈఓ గారు వెంటనే స్పందించగలరు.


ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలు:



  • కేటగిరీల వారీగా కార్డుల మార్పులకు కృషి చేయుట కు అనుమతి.
  • మెడికల్ రీయింబర్స్ మెంట్ పథకం కింద లక్షరూపాయల వరకు జిల్లా కేంద్రాల్లోని అనుమతి.
  • హాస్పిటల్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి, హాస్పిటల్ లను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి వైద్యం అందించని హాస్పిటల్స్ పై తీవ్రమైన చర్యలు తీసుకునేలా అనుమతి.
  • వన్ టైం హెల్త్ చెకప్ ను పూర్తిగా గవర్నమెంట్ భరించే విధంగా ప్రతిపాదన.
  • ఈ సమావేశంలో AP NGOs పక్షాన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు APJAC సెక్రెటరీ జనరల్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు గారు , సోదర సంఘ సభ్యులు EHS హెల్త్ స్కీమ్ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The main topics discussed at the EHS conference "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0