Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Concession up to 100% on train ticket

ట్రైన్ టికెట్‌పై 100% వరకు కన్సెషన్... ఎవరెవరికో తెలుసా?
 ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు తగ్గింపు ధరకే రైలు టికెట్ ఆఫర్ చేస్తోంది. కొందరికైతే 100 శాతం తగ్గింపుతో ఉచితంగా టికెట్ ఆఫర్ చేస్తోంది.
Concession up to 100% on train ticket

విద్యార్థులు: 


  • భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం సొంతూళ్లకు లేదా ఎడ్యుకేషనల్ టూర్లకు వెళ్లే జనరల్ కేటగిరీ విద్యార్థులకు సెకండ్ క్లాస్‌, స్లీపర్ క్లాస్‌లో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 75 శాతం తగ్గింపు లభిస్తుంది. అమ్మాయిలకు గ్రాడ్యుయేషన్ వరకు, అబ్బాయిలకు 12వ తరగతి వరకు ఇంటి నుంచి పాఠశాల లేదా కాలేజీ మధ్య ఉచితంగా సెకండ్ క్లాస్ మంత్లీ సీజన్ టికెట్ ఇస్తోంది రైల్వే
  • గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్టడీ టూర్ కోసం ఏడాదికి ఓసారి, ఎంట్రెన్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్తే సెకండ్ క్లాస్‌లో 75 శాతం తగ్గింపు లభిస్తుంది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు వెళ్తే సెకండ్ క్లాస్‌లో 50 శాతం తగ్గింపు లభిస్తుంది

 నిరుద్యోగులు: 

నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్వ్యూకు వెళ్తే సెకండ్, స్లీపర్ క్లాసుల్లో 50 శాతం తగ్గింపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్తే సెకండ్ క్లాస్‌లో 100 శాతం, స్లీపర్ క్లాస్‌లో 50 శాతం తగ్గింపు లభిస్తుంది

 వికలాంగులు: 

ఎస్కార్ట్ లేకుండా ప్రయాణించలేని శారీరక, మానసిక వికలాంగులకు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్ కార్‌లో 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలో 50 శాతం తగ్గింపు పొందొచ్చు. రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 25 శాతం తగ్గింపు పొందొచ్చు. ఎస్కార్ట్‌కు కూడా కన్సెషన్ రూల్స్ వర్తిస్తాయి.

వృద్ధులు:


  •  60 ఏళ్లకు పైబడ్డ పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రైలు టికెట్లపై తగ్గింపు లభిస్తుంది. రాజధాని, శతాబ్ధి, దూరంతో రైళ్లు సహా అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుంది.
  • పేషెంట్స్: క్యాన్సర్ చికిత్స పొందుతున్న పేషెంట్లకు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్‌లో 75 శాతం, స్లీపర్ క్లాస్‌, థర్డ్ ఏసీలో 100 శాతం, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఒంటరిగా లేదా ఎస్కార్ట్ సాయంతో ప్రయాణించే తలసేమియా పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, కిడ్నీ రోగులకు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్‌లో 75 శాతం కన్సెషన్ లభిస్తుంది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలో 50 శాతం తగ్గింపు పొందొచ్చు.


యుద్ధ వితంతువులు: 

తీవ్రవాద దాడులు లేదా యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలకు సెకండ్, స్లీపర్ క్లాస్‌లో 75 శాతం తగ్గింపు లభిస్తుంది

భారతీయ రైల్వే అందించే తగ్గింపు వేర్వేరు కేటగిరీలను బట్టి 10 శాతం నుంచి 100 శాతం మధ్య ఉంటాయి. వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంటాయి
              VIEW THE WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Concession up to 100% on train ticket"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0