10 thousand annually for Rajas, Nayyabrahmans and Tailors
రజకులు , నాయీబ్రాహ్మణులు , టైలర్లకు ఏటా రూ . 10 వేలు
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
రజక , నాయీబ్రాహ్మణ , టైల రింగ్ వృత్తిలో ఉండి స్థిర , సంచార యూనిట్లు ( దుకాణాలు / తోపుడు బండ్లు ) ద్వారా జీవనోపాధి ని పొందుతున్నవారికి ఏటా రూ . 10 వేల ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది . లబ్దిదారులు ఆర్థిక సాయాన్ని పొంద డానికి సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .విధివిధానాలు
- ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను వలం టీర్లు పరిశీలించి స్థిర , సంచార యూనిట్లకు వెబ్ పోర్టల్లో తెలిపిన విధంగా జియోట్యా గింగ్లు వేసి ఆ వివరాలను సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు అప్లోడ్ చేస్తారు
- వలంటీర్లు సమర్పించిన లబ్ధిదారుల దరఖా స్తులను ఆయా పంచాయతీల కార్యదర్శులు / బిల్ కలెక్టర్లు పరిశీలించి అర్హులను సంబం ధిత ఎంపీడీవోలు / మునిసిపల్ కమిషనర్ల లాగిన్లకు సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు పంపుతారు .
- పంచాయతీ కార్యదర్శులు / బిల్ కలెక్టర్లు పం పిన లబ్దిదారుల జాబితాను ఎంపీడీవోలు / మునిసిపల్ కమిషనర్లు చివరగా మరోసారి పరిశీలిస్తారు .
- ఆ తర్వాత అర్హుల జాబితాను ఆయా జిల్లాల వెనుకబడిన తరగతుల సేవా | సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలకు , కలె కర్లకు సెప్టెంబర్ 15 , 2019 నుంచి జనవరి 10 , 2020 లోపల పంపి జనవరి 15లోపు ఆమోదం పొందాలి .
- జిల్లా కలెక్టర్లు , జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థలు ఆమోదించిన జాబి తాల ప్రకారం ఆర్థిక సాయాన్ని లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఎండీకి జనవరి 25 లోపు పంపాలి .
- ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ 2019 - 2020కి సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా రూ . 10 వేలు నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి జనవరి 31లోపు ప్రభుత్వానికి బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
- ఆధార్ కార్డు
- కులధ్రువీకరణ పత్రం
- తెల్ల రేషన్ కార్డు
- బ్యాంక్ పాస్బుక్ నకలు .
- స్థిర , సంచార యూనిట్లు ( దుకాణాలు / తోపుడు బండ్లు ) నిర్వహించేవారు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం నకలు ( లేబర్ డిపార్ట్ మెంట్ / మెప్మా ద్వారా జారీ చేసినవి )
0 Response to "10 thousand annually for Rajas, Nayyabrahmans and Tailors"
Post a Comment