Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Engineer's day Special

సరిలేరు మీకెవ్వరూ !
ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

 మోక్షగుండం విశ్వేశ్వరయ్య
 15 సెప్టెంబర్ 1861 - 12 ఏప్రిల్ 1962 

  • భారతదేశపు ప్రముఖ ఇంజినీరు 
  • బ్రిటీష్ ప్రభుత్వం , కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదు ఇచ్చింది 
  •  1955లో భారతరత్న అందుకున్నారు 
  •  పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు  బెంగళూరులో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ స్థాపనలో కీలకపాత్ర
Engineer's day Special

ఆయన ప్రతి ఆలోచన జాతి నిర్మాణం పైనే . నిబద్దత , సమయపాలన , అంకితభావానికి ఆయన మారు పేరు , నేటి ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన మహా మేధావి . మన ఆర్థిక వ్యవస్థలో రెండు కీలక అంశాలయిన ఆనకట్టలు , పరిశ్రమలకు ఊపిరులూదిన గొప్ప దార్శనికుడు . ఆయనే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య  నేడు ఆయన జయంతి , ఈ రోజున దేశమంతా ఇంజినీర్స్డేను ఘనంగా నిర్వహించుకుంటోంది . నేటి బెంగళూరుకు సమీపంలో కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం ముద్దనహళ్లిలో 1861 సెప్టెంబర్ 15న తెలుగు కుటుంబంలో విశ్వేశ్వరయ్య జన్మించారు  ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని మోక్షగుండం గ్రామం నుంచి కర్ణాటకకు వలస వెళ్లారు . ఆయన తండ్రి పేరు శ్రీనివాస శాస్త్రి , తల్లి వెంకటలక్ష్మమ్మ , విశ్వేశ్వరయ్య పుణెలోని కాలేజ్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజినీరింగ్ చదివి అత్యున్నతస్థానంలో నిలిచారు . 1962 ఏప్రిల్ 12న కన్నుమూశారు . 

ఇంజినీర్ గా ప్రస్థానం ప్రారంభం 

ఇంజినీరింగ్ తర్వాత 1884లో విశ్వేశ్వర య్యకు బొంబాయి ప్రభుత్వంలో ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది . ఇంజినీర్గా ఆలా మొదలైన విశ్వ శ్వరయ్య ప్రస్థానం ఏడు దశాబ్దాల పాటు కొన సాగింది . నీటి పరిరక్షణపై ఆయనకు అమితా సక్తి , అందుకు అనుగుణంగా ఆయన దేశ వ్యా ప్తంగా నీటి సరఫరా , మురుగునీటి పారుదల , సాగునీటి వ్యవస్థలకు రూపకల్పన చేశారు . కొల్హాపూర్ , ఇండోర్ , గ్వాలియర్ , భోపాల్ , నాగ్ పల్, గోవా , భావనగర్ , బరోడా , సాంధీ , బిహార్ , ఒడిశా , యెమన్లోని అనేక నీటిసరఫరా వ్యవస్థలకు భిన్ చేయడం కానీ సలహాదారుగా వ్యవహరించడం కానీ చేశారు .

హైదరాబాద్ కు రక్షణ కవచం :

 భారీ వర్షాలతో హైదరా బాద్లోని మూసీ నదికి వరదలు వచ్చేవి . ఫలితంగా వేల మంది ప్రాణాలు కోల్పోయేవారు . 1908లో నిజాం నవాబు విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య ఇక్కడ డ్రైనేజీ , తాగునీటి సరఫరా వ్యవస్థలను | డిజైన్ చేశారు . దీంతో ప్రమాదకర వరదల నుంచి హైదరాబాద్దు దాదాపుగా విముక్తి లభించింది . ఇక ప్రధాన నీటి వనరు అయిన ఖడకవాసా రిజర్వాయరకు ఆటోమేటిక్ గేట్లతో కూడిన ఒక వ్యవస్థను రూపొందించారు . మైసూరు వద్ద ఉన్న కృష్ణరాజ సాగర్ డ్యామ్లోనూ ఇలాంటి వ్యవస్థనే అమర్చారు . ఎడారిగా ఉన్న మాండ్య జిల్లా , ఈ డ్యామ్ వల్ల ధాన్యాగారంగా మారింది . • తిరుమల నుంచి తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్ | తయారు చేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు .

విద్యాప్రదాత

  •  1912లో విశ్వేశ్వరయ్య మైసూర్ దీవాన్గా ఎంపికయ్యారు . 
  • ఆ హోదాలో ఆయన 1912 నుంచి 1918 మధ్యకాలంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు .
  •  ఆ సమయంలో వాటి సంఖ్య 1588 నుంచి 112కు పెరగడం విశేషం .

పాత ఓడను ముంచి విశాఖ రేవును గట్టెక్కించి . 

దేశంలోని అగ్రగామి ఓడరేవుల్లో ఒకటిగా విశాఖపట్నం పోర్ట్ నిలవడం వెనక మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచన అత్యంత కీలకం . 1827 - 33 మధ్య ఈ రేవును నిర్మిస్తున్నప్పుడు అలల పోటు ఎక్కువగా ఉండేది . దీనిని తగ్గించడానికి అవసరమైన కాంక్రీటు అడ్డుకట్ట ( బ్రేక్ వాటర్స్ ) నిర్మాణ సాంకేతి కత అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు . సమస్య తీవ్రత మోక్షగుండం దృష్టికి వెళ్లడంతో ఆయనొక సులభమైన పరిష్కారం చూపించారు . ఆడేం టంటే . . . పాతబడిన రెండు ఓడల నిండా బండరాళ్ళు వేసి , సముద్ర తీరానికి చేరువగా వాటిని ముంచేయడమే . . ! ఆది ఎంచక్కా పనిచేసి కెరటాల ఉద్ద తిని తగ్గించింది . ఆ తర్వాత కొన్నాళ్లకు కాంక్రీటు దిమ్మలతో బ్రేక్ వాటర్స్ ను నిర్మించడంతో సమస్య శ్వతంగా పరిష్కారమయింది .
వాణిజ్య సంస్థలు విశ్వేశ్వరయ్యను ఆధునిక మైసూర్ రాష్ట్రాని ( ప్రస్తుత కర్ణాటక ) కి పితామహుడిగా పరిగణిస్తాడు అనేక పరిశ్రమలు , వాణిజ్య , సాంస్కృతిక సంస్థల ఏర్పా టులో కీలక పాత్ర పోషించారు . వాటిలో కొన్ని . . . • మైసూర్ సోప్ ఫ్యాక్టరీ ( మైసూర్ శాండిల్ ఉత్పత్తులు ) • మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్ ( ప్రస్తుతం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ • స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ , • ద సెంచరీ క్లబ్ • మైసూర్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కర్ణాటక సాహిత్య పరిషత్ 

వరించిన గౌరవాలు . 


  •  బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ , అప్పటి నుంచి సర్ హోదా .
  • 1855లో భారతరత్న 
  •  ఆనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు ,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Engineer's day Special"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0