Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Bank Holidays


  • బ్యాంకులకు వరుస సెలవులు.
  • నగదు కొరతపై ప్రజల ఆందోళన 
  • ఈనెల 26 , 27 తేదీల్లో బ్యాంకు సిబ్బంది సమ్మె 
  • 28 , 29 , 30 , అక్టోబర్ 2న బ్యాంకులు సెలవు

 About Bank Holidays

 నగదు కొరత రాకుండా ప్రజలు ముందుగానే జాగ్రత్త పడితే మంచిది . ఎందు కంటే ఈనెల 27వ తేదీ నుంచి వరుసగా 6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి . మధ్యలో ఒకరోజు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి . దీంతో ప్రజలు నగదు కొరతపై ఆందోళన చెందుతున్నారు . కేంద్రం సాగిస్తున్న విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈనెల 26 , 27 తేదీల్లో సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపు నిచ్చాయి . ఈ సమ్మెలో పాల్గొనడంపై బ్యాంకింగ్ దిగ్గజం ఎసీబీఐకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు . మిగిలిన అన్ని ప్రభుత్వరంగబ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నాయి . ఎస్ బీఐ ఉద్యోగులు కూడా దాదాపుగా సమ్మెలో పాల్గొంటారని సంఘ నాయకులు చెబుతు న్నారు . దీంతో ఈ రెండురోజులు బ్యాంకులు మూతపడనున్నాయి . 28వ తేదీ నాలో శని వారం కావడం సెలవు , 29వ తేదీ ఆదివారం సెలవు . ఇక 30వ తేదీ అర్ధసంవత్సరం ముగింపు రోజు కావడంతో సెలవు బ్యాంకులు సెలవు ప్రకటించాయి . మధ్యలో వచ్చేనెల 1వ తేదీ మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి . మళ్లీ2వతేదీ గాంధీ జయంతి సెలవు . ఇలా వరుస సెలవులు రానున్నాయి .

ఖాతాదారులకు ఇక్కట్లు తప్పవా ? 

ఇలా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పు డల్లా నగదు కొరతతో జనం అనేక ఇక్కట్లు పడుతున్నారు . మామూలు రోజుల్లోనే ఏటీ ఎంలు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయి . నగదుకోసం నాలుగైదు ఏటీఎం సెంటర్లకు వెళితే గాని లభించని పరిస్థితి . సాధారణంగా శని , ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తేనే నగదు కోసం ఖాతాదారులు నానా తిప్పలు పడాల్సి వస్తుంది . ఏటీఎంలు పని చేయడంలేదు . ఇప్పుడు ఏకంగా 5 రోజులు వరుస సెలవులు . అక్టోబర్ 1 మినహా మళ్లీ సెలవు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతు న్నారు . నగదు కొరత రాకుండా , ఇబ్బందులు పడుకుండా బ్యాంకు అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు . వరుస సెలవులతో రిజిస్టేషన్లు , ఇతర వ్యాపార లావాదేవీలు కూడా నిలిచిపోతున్నాయి .

బ్యాంకులు  పనిచేయని రోజులు ఇవే...

సెప్టెంబర్ 26, 27: బ్యాంక్ యూనియన్ల రెండు       రోజుల సమ్మె
సెప్టెంబర్ 28: నాలుగో శనివారం 
 సెప్టెంబర్ 29:   బ్యాంకుకు ఆదివారం సెలవు
అక్టోబర్ 2:         గాంధీ జయంతి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " About Bank Holidays"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0