Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The changes in the educational system


  • విద్యావ్యవస్థలో సమూల మార్పులు.
  • నైపుణ్యాభివృద్ధికి దక్షిణ కొరియాతో ఒప్పందం 
  • జస్టిస్ కాంతారావు , ఈశ్వరయ్యలతో రెండు కమిటీలు 
  • విద్యాశాఖా మంత్రి సురేష్ వెల్లడి 

The changes in the educational system

రాష్ట్రంలో విద్యా , సాంకేతిక శిక్షణకు దక్షిణ కొరియా భాగస్వామ్యం , పరస్పర సహకారంపై అంగీకారం కుదిరినట్లు రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు . మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన దక్షిణ కొరియా ప్రతినిధి బృందం మంత్రి , విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది . మొత్తం 18 మంది కొరియన్ బృందంతో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అంగీకారం కుదిరినట్లు భేటీ అనంతరం మంత్రి మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు . ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వృత్తి నైపుణ్యతకు పెద్ద పీట వేస్తున్నామని , నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . ఇదే విషయాన్ని దక్షిణ కొరియా బృందానికి వివరించామన్నారు . దక్షిణ కొరియాకు చెందిన బ్లాక్ చైన్ టెక్నాలజీ విషయంలో ఏపీతో పరస్పర సహకారం , శిక్షణకు కొరియన్ బృందం ముందుకు వచ్చినట్లుతెలిపారు . దీనితో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో కొరియన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు . అలాగే ట్రిపుల్ ఐటీల్లో ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్లకు కూడా సాంకేతిక సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు . .

 విశ్రాంత న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీలు 

 రాష్ట్రంలో ప్రాథమిక , ఉన్నత విద్యలో ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కమిషన్లను ఏర్పాటు చేయాలని సంకల్పించారని , దీనిలో భాగంగా జస్టిస్ ఆర్ కాంతారావు చైర్మన్గా పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ , జస్టిస్ వి . ఈశ్వరయ్య చైర్మన్ గా ఉన్నత విద్యానియంత్రణ కమిటీలను ప్రభుత్వం నియమించిందని మంత్రి సురేష్ తెలిపారు . ఫీజుల నియంత్రణ , విద్యాసంస్థల్లో ప్రమాణాల పర్యవేక్షణతో పాటు ఇతర అంశాల్లో ఈ కమిటీలకు పూర్తి అధికారాలు ఉంటాయని వెల్లడించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The changes in the educational system"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0