Ananda vedika daily programs dated on 06.09.2019 Friday
ఆనంద వేదిక రోజువారీ కార్యక్రమాలు తేదీ.06-09-19 శుక్రవారం తరగతి గది నిర్వహణ కార్యక్రమం
Anandavedika Daily programmes
Date 06.09.2019
ఆనంద వేదిక రోజు వారి కార్యక్రమాలు.
తేదీ : 06.09.2019 శుక్రవారం,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
Anandavedika Daily programmes
Date 06.09.2019
ఆనంద వేదిక రోజు వారి కార్యక్రమాలు.
తేదీ : 06.09.2019 శుక్రవారం,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
ఆనంద వేదిక( శుక్రవారం )కార్యక్రమములు
1,2 లెవెల్. 1నుండి 5 తరగతులు
తేదీ 6.9.2019 కృత్యం పూర్తీ కార్యక్రమం.
మనం చూసిన విన్న చదివిన దానికంటే కృత్యం ద్వారా లభించిన జ్ఞానం ఎల్లప్పుడూ..గుర్తుండి పోతుంది. విద్యార్థి తనకు తాను వ్యక్తిగా ఎదుగుతూ..తనపట్ల తాను అవగాహన ఏర్పరచుకుంటూ..
కుటుంబం పట్ల సమాజం పట్ల ప్రకృతి పట్ల ఒక సంపూర్ణావగాహన పెంచుకోవడమే..లక్ష్యం కావాలి.
కృత్య నిర్వహణ గురు శుక్రవారాలలో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.కానీ..వారంలో...ఒకరోజు సెలవు రావడం వల్ల రేపు పూర్తీకృత్యాన్ని నిర్వహించాలి.
విద్యార్థులు విన్నకథ లోని మౌళిక విలువల ఆధారంగా..కృత్యాల నిర్వహణ ఉంటుంది.ఆటలంత ఆనందంగా..
పాటలంత ఉత్సాహంగా .కృత్య నిర్వహణ జరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయునిదే!
కృత్యము...1వ లెవెల్ (1 మరియు 2 తరగతులు)
లక్కీ ఫెలో
ఉద్దేశ్యం; విద్యార్థులు ఒకరికొకరు పంచుకోవడం. సహకారం పెంపొందించుకోవడం .
కృత్యము...2వ లెవెల్ (3 .4.5 తరగతులు)
అడగండి చెబుతా..
ఉద్దేశ్యము... విద్యార్థులు వారి భావోద్వేగాల పై అవగాహన కలిగి వుండి వాటిని ఎలా నియంత్రించుకోవాలో తెలియజేయుట
మైండ్ ఫుల్ యాక్టివిటీ (ఏకాగ్రత ప్రక్రియ)
- మూడు నిమిషాలు చేయించాలి
- సాధారణ శ్వాసలు
- వాటి కొనసాగింపు
- దీర్ఘ శ్వాసలు
- వాటి కొనసాగింపు
- తిరిగి సాధారణ శ్వాసలు
- నెమ్మదిగా. కళ్ళు తెరవడం
కృత్యం నిర్వహణ.
కరపత్రిక లో 1 వ లెవెల్ 2 వ లెవెల్ కృత్యములు పూర్తిగా..2 రోజులకు కలిపి ఈరోజు నిర్వహించాలి
కార్యాచరణ సోపానాలు:
1 మరియు 2 వ లెవెల్స్ వారు ఇచ్చిన కరపత్రాలలో ఉన్నట్లు విద్యార్థులకు కృత్యాల నిర్వహించాలి.
విద్యార్థులందరూ..ఆనందవేదికలో పాల్గొనాలి.
ఉపాధ్యాయులకు సూచనలు:
- ఇందులో...విద్యార్థులందరూ..పాల్గొన్నట్లు చూడాలి
- ఉపాధ్యాయుడు వీలైతే విద్యార్థులతో సహజంగా..స్వేచ్ఛగా..మాట్లాడేలా.. చేయాలి.
- తరగతి వాతావరణం ఉల్లాసంగా ఉండే లా.. చూడాలి.
మౌనప్రక్రియ:
- విద్యార్థులందరినీ... రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.
- కళ్ళు మూసుకొని ఉంచలేనట్లయితే...కళ్ళు తెరచి కిందకి చూడమనవచ్చు.
- ఈ కృత్యాన్ని ఇంట్లో..తల్లి దండ్రులతోనూ...స్నేహితుల తోనూ చెప్పి వారితో కలసి ఉన్నప్పుడు సంతోషంగా..ఉండేవిధంగా మసలు కోవాలని విద్యార్థులకు తెలియజేయాలి
0 Response to "Ananda vedika daily programs dated on 06.09.2019 Friday"
Post a Comment