Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Grama/Ward Sachivalayam Eligibility details


  • సచివాలయ' పరీక్షల ఫలితాలు విడుదల.. అర్హత మార్కులు ఇలా.
  • సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు.
  • వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు.


ప్రధానాంశాలు:

  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో
  • పరీక్షలో అర్హత సాధించిన 1.98 లక్షల మంది అభ్యర్థులు
  • కటాఫ్ మార్కులు కూడా అందుబాటులో
ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబరు 19) విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన 14 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష పూర్తయిన పదిరోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 అధికారులు ఫలితాలు విడుదల చేసినప్పటికీ.. సర్వర్ మొరాయించడంతో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోలేకపోతున్నారు.

మొత్తం 1.98 లక్షల మంది అర్హత.. 
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 1,98,164 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో పురుషులు-1,31,327 మంది; స్త్రీలు-66,835 మంది ఉన్నారు. 
విభాగాలవారీగా అర్హత వివరాలను పరిశీలిస్తే..

కేటగిరీ           అర్హత సాధించినఅభ్యర్థులు

ఓపెన్ కేటగిరీ 24,583

బీసీ                 1,00,494

ఎస్సీ                 63,629 

ఎస్టీ                 9,458

మొత్తం         1,98,164

అర్హత మార్కులు ఇలా.. 

కేటగిరీ                అర్హత మార్కులు
ఓపెన్ కేటగిరీ              40%
బీసీ                              35%
ఎస్సీ,ఎస్టీ,దివ్యగానులు    30%

            T0PERS LIST


POST CATEGORY WISE DISTRICT TOPPERS



                 VIEW THE RESULT
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Grama/Ward Sachivalayam Eligibility details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0