Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Candidates who have scored the best in the exam ..AP Grama/Ward Sachivalayam 2019

పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు..
Candidates who have scored the best in the exam ..AP Grama/Ward Sachivalayam 2019
--------------------------------------------------
కేటగిరీ           అర్హత సాధించినఅభ్యర్థులు
ఓపెన్ కేటగిరీ    24,583             

బీసీ                 1,00,494

ఎస్సీ                 63,629

ఎస్టీ                 9,458

మొత్తం         1,98,164
----------------------------------------
కేటగిరీ        మార్కులు      '
ఓపెన్ కేటగిరీ 122.5          '
బీసీ                 122.5          '
ఎస్సీ                 114             '
ఎస్టీ.           108             '
-------------------------------------
అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా 788 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న మొత్తం 788 సచివాలయాల్లో.. మండలానికి ఒకటి చొప్పున 678 పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఒక్కో వార్డు చొప్పున 110 సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల స్వీకరణకు 1902 కాల్‌సెంటర్‌ నెంబరును ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా ఈ నెంబరుకు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.

పరీక్షలు సాగాయిలా..


  • సెప్టెంబరు 1న కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు నిర్వహించారు.
  • సెప్టెంబరు 3న వీఆర్వో, సర్వేఅసిస్టెంట్; ఏఎన్‌ఎం/వార్డు హెల్త్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించారు.
  • సెప్టెంబరు 4న విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించారు.
  • సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ పరీక్షలు నిర్వహించారు.
  • సెప్టెంబరు 7న కేటగిరీ 2(ఎ) ఇంజినీరింగ్ అసిస్టెంట్/వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, కేటగిరీ-3 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు.
  • సెప్టెంబరు 8న కేటగిరీ 3 వార్డు ప్లానింగ్-రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్-డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్-ఎన్విరాన్‌మెంట్ సెక్రటీ పరీక్షలు నిర్వహించారు.

మొత్తం పోస్టులు ఇలా...

గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,589 పోస్టులను ప్రభుత్వం భర్తీచేయనున్నారు. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజి ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

స్టైఫండ్ రూ.15 వేలు...

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓగా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.
            VIEW THE RESULT

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Candidates who have scored the best in the exam ..AP Grama/Ward Sachivalayam 2019"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0