Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Download Call Letters

'సచివాలయ' ఉద్యోగాలు.. అక్కడిక్కడే నియామక పత్రాలు.

ప్రధానాంశాలు:

మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించిన అధికారులు
వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాను ఉంచాలని అభ్యర్థుల వినతి
సర్టిఫికేట్ల పరిశీలన కాగానే.. అక్కడికక్కడే నియామక పత్రాలు.
Download Call Letters

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం అక్కడికక్కడే నియామక పత్రాలు జారీచేయనున్నారు. సోమవారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన అని అధికారులు ప్రకటించినప్పటికీ.. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అభ్యర్థుల మెరిట్ జాబితా కొలిక్కిరాలేదు. సోమవారం ఉదయానికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందిస్తామని.. మిగతావారి వివరాలు వెల్లడించమని కొన్ని జిల్లాల్లో అధికారులు చేసిన ప్రకటనలతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు మెరిట్ జాబితాలను జిల్లా వెబ్‌సైట్‌లలో పెట్టే యోచనలో ఉన్నారు.
సెప్టెంబరు 19న గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను జిల్లాలకు పంపించారు. ఆయా జిల్లాల్లోని కమిటీలు ఆయా వివరాలను పరిశీలించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం మెరిట్ జాబితాలను రూపొందించాయి. మెరిట్ జాబితాలో ఎంపికైనవారికి మాత్రమే SMS ద్వారా సమాచారం అందించారు. మెరిట్ జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచలేదు. దీనిపై అభ్యర్థులు ఆందోళను వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించి.. మిగతావారి వివరాలు చెప్పకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందించిన అభ్యర్థులకు సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు
వెయిటేజీ కలపలేదు-ఏఎన్‌ఎల ఆందోళన..
సచివాలయ ఉద్యోగ నియామకాల్లో తమకు వెయిటేజీ మార్కులు కలపలేదని ఔట్‌సోర్సింగ్ ఏఎన్ఎంలు ఆదివారం (సెప్టెంబరు 22) కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. మరోవైపు అర్హత మార్కుల్లో తమకు రిజర్వేషన్లు అమలు చేయలేదని ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి...

 అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం తీసుకెళ్లాలి
✦ గెజిటెట్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికేట్లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంటతీసుకెళ్లాలి.
✦ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తప్పనిసరి.
✦ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి సర్టిఫికేట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి.
✦ విద్యార్హతకు సంబంధించిన అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు తీసుకెళ్లాలి.
✦ 4 నుంచి 10వ తరగతి దాకా విద్యాభ్యాసానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు.
✦ పాఠశాలలో, కళాశాలలో చదవకుండా.. నేరుగా డిగ్రీ చదివినవారు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి.
✦ ఏపీ పునర్విభజన కారణంగా 02.06.2014 - 01.06.2019 మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన అభ్యర్థులు స్థానికత కోసం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
✦ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
✦ బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
✦ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొందిన అభ్యర్థులు తమ ప్రధానాధికారి నుంచి ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
✦ అభ్యర్థులు తమపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
✦ ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు, వినికిడి లోపాలు ఉన్న అభ్యర్థులు తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
✦ ఇక దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్, NCC విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.
            DOWNLOAD CALL LETTERS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Download Call Letters"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0