Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the things we do when we lose our precious cards

పర్సు  పోగొట్టుకున్నారా?

నగదుకు బదులుగా కార్డుల ద్వారానే ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్న నేటి కాలంలో ఈ కార్డులు తీసుకునేవారు , వాటితో చెల్లింపులు చేసేవారు పెరిగిపోతున్నారు . ఎవరి పర్సులో చూసినా డెబిట్ , క్రెడిట్ కార్డులు తప్పనిసరిగా ఉంటాయి . ప్రయాణాల్లో , షాపింగ్ లేదా ఇతర సందర్భాల్లో పర్సును ఎవరైనా దొంగిలించవచ్చు . ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా కంగారు పెరిగిపోతుంది . తమ కార్డులను ఎవరు దుర్వినియోగం చేస్తారోనని భయపడుతుంటారు . కొంతమంది తమ     కార్డులన పిన్ నెంబర్లను కూడా పర్సులోనే దాచుకుంటారు . ఇలాంటివారు మరీ ఎక్కువ కంగారు పడుతుంటారు . ఇలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కార్డులు దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు . 
These are the things we do when we lose our precious cards

తీసుకోవలసిన జాగర్తలు


  • కార్డులు దొంగతనానికి గురైన సందర్భాల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి , ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలి . 
  • కార్డును దుర్వినియోగం చేసినప్పుడు అందుకు సంబంధించిన లావాదేవీ మనం నిర్వహించలేదు అనడానికి ఇది ఆధారంగా పనికివస్తుంది . 
  • కాబట్టి , ఆ మొత్తాన్ని మనం చెల్లించాల్సిన అవసరం ఉండదు . 
  • అలాగే , బ్యాంకు నుంచి మరో డూప్లికేట్ కార్డును పొందడానికి ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉపయోగపడుతుంది . 
  • కార్డులు కోల్పోయినట్టు గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన కాల్ సెంటర్ కు ఫోన్ చేసి , కార్డును బ్లాక్ చేయించాలి . 
  • డెబిట్ కార్డు అయితే కాల్ సెంటర్ నెంబర్లు ఆ బ్యాంకు ఏటీఎం ద్వారా తెలుసుకోవచ్చు . 
  • లేదా బ్యాంకు శాఖ ద్వారా తెలుసుకొని , బ్లాక్ చేయించవచ్చు . 
  • కాల్ సెంటర్ నెంబర్ బ్యాంక్ వెబ్ సైట్లోనూ అందుబాటులో ఉంటుంది .
  •  అయితే , కొంతమంది మోసకారులు బ్యాంక్ కాల్ సెంటర్ నెంబర్ పేరుతో తప్పుడు నెంబర్ | చూపి , మోసం చేయడానికి అవకాశం ఉంటుంది . 
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానూ కార్డును బ్లాక్ చేయవచ్చు
  •  . ఈ - బ్యాంకు శాఖను సంప్రదించినా కార్డు పనిచేయకుండా చేస్తారు . 
  • అయితే దీనికి కొంత సమయం పడుతుంది . 
  • ఈ లోపే మీ కార్డు ద్వారా ఏమైనా లావాదేవీలు జరిగితే ఆ భారం మన పైనే పడుతుంది . 
  •  సాధారణంగా క్రెడిట్ , డెబిట్ కార్డుల వెనుక భాగంలో కాల్ సెంటర్ నెంబర్లు ఉంటాయి . 
  • వాటిని మొబైల్ లో ఉంచుకోవడం వల్ల కార్డులు పోయినప్పుడు లేదా ఏదైనా అనధికారిక లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే కాల్ చేసి , ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది . 
  • పర్సులో సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ కార్డు , ఇతర కార్డులు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది . 
  • కాబట్టి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ దోహదపడుతుంది . 
  • కార్డులు పోయిన తర్వాత వాటిని బ్లాక్ చేస్తాం . తర్వాత కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక్కసారి మనం ఏయే కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నామో చూసుకోవాలి . 
  • ఎక్కువగా వాడని కార్డులను మళ్ళీ తీసుకోవడం వృధా . సాధారణంగా కార్డులకు వార్షికంగా ఫీజులు చెల్లించాల్సి వస్తుంది . 
  • కాబట్టి అవసరం ఉన్న కార్డు కోసమే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం . 
  • కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించిన వెంటనే మొబైల్ నెంబరుకు ఎస్ఎంఎస్ వస్తుంది . 
  • మనం పోగొట్టుకున్న కార్డుకు సంబంధించి ఏమైనా లావాదేవీలు జరుగుతున్నాయా అనేది దాని ద్వారా చూసుకోవాలి . 
  • క్రెడిట్ కార్డు విషయంలో అయితే స్టేట్మెంట్ ను పరిశీలించాలి . 
  • ఏమైనా తేడాలు ఉంటే కార్డు జారీ చేసిన బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీకి సమాచారం అందించాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the things we do when we lose our precious cards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0