Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Final list of Secretariat jobs online.


  • ఆన్ లైన్ లో సచివాలయ ఉద్యోగాల ఫైనల్ లిస్ట్..
  • 27 లోపు నియామక పత్రాలు..
  • పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్ వెల్లడి..
Final list of Secretariat jobs online.

గ్రామ , వార్డు సచివాలయ | ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా తుది మెరిట్ జాబితాను ఆన్ లైన్లో ఉంచినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు . రోసర్ , రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ లిస్ట్ను తయారుచేశారని సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు . మెరిట్ లిస్ట్లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని , ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని , వెరిఫికేషన్ కు వచ్చేటప్పుడు కాల్ లెటర్లు తీసుకొని రావాలని అభ్యర్థులకు ఆచప సూచించారు . మెరిట్ లిస్తీను నోటీసు బోర్డులో అంటించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు . ఏ అభ్యర్థి ఏ రోజు ఏ ప్రాంతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని , పలు కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు .
 అదివారం నాటికి అన్ని జిల్లాల మెరిట్ లిస్టుల తయారైనట్లు తెలిసింది . ఎంపికైన వాళ్లకి ఈనెల 29వతేదీ లోపు నియామక పత్రాలు అందజేసి , మొదటి విడతలో | సెప్టెంబర్ 30 , అక్టోబర్ 1వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు .అదేవిధంగా రెండో విడతలో భాగంగా అక్టోబర్ 14 నుంచి నవంబర్ 15వ తేదీలమధ్య ఉద్యోగులకు దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది . ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా ఈనెల 26వ తేదీ నుంచి మాస్టర్స్ టైనర్స్ కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు . రిజర్వేషన్ , రోస్టర్ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లో నిర్ణీత సంఖ్యలో పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు . వెరిఫికేషన్ కొరకు ఏమేమి సర్టిఫికెట్లు తీసుకురావాలనేది అభ్యర్థికి పంపే కాల్ లెటర్ ద్వారా సమాచారం అందిచనున్నట్లు తెలిసింది .

 సందేహాల నివృత్తికొరకు హెల్ప్ లైన్ నంబర్లు

గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపికపై సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ , పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి కార్యాలయం వద్ద హెల్ప్లైన్ ఏర్పాట్లు , గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయటం జరిగిందని కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు . ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్స్లైన్ నంబర్లు , గ్రీవెన్ సెల్ నందు అర్జీలు , సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు . సందేహాలు ఉన్న అభ్యర్థులు హెల్ప్ లైన్ నంబర్లు 9121286051 - 52 - 53 - 54 - 55 ఫోన్ చేయవచ్చునని , అదేవిధంగా గ్రీవెన్ సెల్లో భాగంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్జీలు తీసుకోవడం జరుగుతుందని , వీటితో పాటు మెయిల్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చునని కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు .
గమనిక
సర్టిఫికెట్స్ అప్లోడ్, మెరిట్ లిస్ట్ డౌన్లోడ్,మరియు  కాల్ లెటర్ డౌన్ లోడ్     కొరకు
             VIEW THE PAGE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Final list of Secretariat jobs online."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0