Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Govt to issue special identity card to students of BC


  • బీసీ విద్యార్థులకు హాయ్ కార్డులు..
  • ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వనున్న ప్రభుత్వం..
  • గుర్తింపు కార్డులో విద్యార్థి వివరాలు..
  • రెండో విడతలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్డులు అందజేత..
Govt to issue special identity card to students of BC

విద్యార్ధులకు హాయైన వార్త . ఆరోగ్యం , వైద్యం , గుర్తింపుతో కూడిన | హాయ్ కార్డులు ఇవ్వడానికి బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది . ఈ విధానం గతంలో ఉండేది . గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మరుగున పడిన వసతి గృహాలకు మంచి రోజులు వచ్చా యి . వైఎస్ఆర్ పీసీ అధికారంలోకి వచ్చిన వెం టనే నూతన ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది . ఇప్పటికే ఈ వసతి గృహాల్లో కార్పొరేట్ స్థాయి మరుగుదొడ్లు , విద్యుద్దీకరణ , భవనాల మరమ్మతులు చేపడుతు న్నారు . దీనికి గాను ప్రతి వసతి గృహానికి రూ . 15 లక్షల వంతున కేటాయించారు . ఈ పనులు కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి . అంతే కాకుండా వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన బియ్యాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంద జేస్తుంది . ఈ నేపథ్యంలో తొలిదశలో బీసీ సం క్షేమ శాఖ వసతి గృహాలకు ఈ కార్డుల మంజూరుకి చర్యలు చేపట్టింది . బిసీ సంక్షేమ శాఖ పరి ధిలో బాలురు , బాలికలు కలిపి 71 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి . వీటిలో సుమారుగా 7500 మంది విద్యార్థులు ఉన్నారు . అలాగే పోస్టు మెట్రిక్ స్థాయిలో 21 వసతి గృహాలు ఉన్నాయి . వీటిలో సుమారుగా 2 ,500 మంది విద్యార్థులు ఉన్నారు . వీరందరికీ ఈ కార్డుల ద్వారా ప్రయో జనం చేకూరనుంది . 

పూర్తి సమాచారం తెలిపేలా . 

 హాయ్ కార్డులు చూడగానే విద్యార్థి విద్య , ఆరో గ్యంతో పాటుగా వ్యక్తిగత వివరాలు తెలుస్తాయి . విద్యార్థి 8వ తరగతిలో వసతి గృహంలో చేరగానే ఈ కార్డులో వివరాలు పొందుపరుస్తారు . మొదటి పేజీలో విద్యార్థి వ్యక్తిగత సమాచారం ఉంటుంది . మొదటి పేజీలో విద్యార్ధి వ్యక్తిగత సమాచారం ఉంటుంది . పేరు , బాలుడు , బాలిక , స్వస్థలం , చిరునామా , కాంటాక్టు నంబర్ , కులం , ఆధార్ నంబర్ , గుర్తింపు చిహ్నాలు ఎంటర్ చేసి , తండ్రి లేదా సంరక్షకుడు సంతకం చేయాల్సి ఉంటుంది . మరో వైపు వసతి గృహం సంక్షేమాధికారి పేరు , సంతకం ఉంటుంది . తర్వాత కాలంలో విద్యార్థి ఎత్తు , బరువు , రక్తం గ్రూపు , ఇతర వివరాలు న మోదు చేస్తారు . విద్యార్థి హాస్టల్ నుంచి బయ టకు వెళ్లే వరకు కారులో అన్ని వివరాలు పొందు పరుస్తూ వస్తారు . హాయ్ కార్డులను సంక్షేమాధి కారులు నిర్వహించాల్సి ఉంటుంది . వారిదే పూర్తి బాధ్యత . ప్రస్తుతం ఇవి ముద్రణ దశలో ఉన్నాయి . వారం , పది రోజుల్లో వసతి గృహాలకు సరఫరా చేయనున్నారు . రెండో విడతలో ఈ కారులు ఇతర సంక్షేమ శాఖలకు అందజేస్తారు . 

విద్యా సంబంధిత వివరాలు

 విద్యార్థి త్రైమాసిక , ఆర్దసంవత్సరం , వార్షిక పరీ క్షల్లో సాధించిన మార్కుల వివరాలను ఎప్పటి కప్పుడు ఈ కార్డులో నమోదు చేస్తారు . ఇందు కోసం కార్డులో ప్రత్యేక పట్టికలను రూపొందిం చారు . సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులు నమోదు చేస్తారు . గరిష్ట మార్కులు , సాధించిన మార్కులు సరాసరి , శాతం నమోదు చేయాల్సి ఉంటుంది .

 ఆరోగ్య వివరాలు 

ప్రతి నెల వసతి గృహాన్ని వైద్యాధికారులు సంద ర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించా లి . అయితే ఈ నిబంధన ఇప్పటి వరకు చాలా వసతి గృహాల్లో అమలు చేయడం లేదు . ఇకపై ఆ పరిస్థితి ఉండదు . వైద్యాధికారి కచ్చితంగా హాస్ట లీకు వెళ్లి పరీక్షలు చేయాల్సిందే . ఆరోగ్య సమ స్యలు ఉంటే హాయ్ కార్డులో పొందుపరుస్తారు .

 అధికారులు , తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి 

ప్రతి నెల జరిగే తల్లిదండ్రుల సమావేశంలో వారి | పిల్లల హాయ్ కార్డులను సంక్షేమాధికారి చూపి | స్తారు . వీటిని చూసి తమ పిల్లలకు పరీక్షల్లో వస్తున్న మార్కులు , ఏయే సబ్జెక్టులో వెనుక బడ్డారో తెలుసుకొనే వీలు కలుగుతుంది .

అమలుకు సిద్దమవుతున్నాం

 చాలా ప్రాధాన్యత గల ఈ హాయ్ కార్డులను పక్కాగా అమలు చేస్తాం . విద్యార్థుల చదు వుతో పాటు , వారి ఆరోగ్య విషయాలు కూడా సమగ్రంగా తెలుసుకొనే వెసులు బాటు ఈ కార్డులో ఉంది . ఇప్పటికే ఈ కార్డుల విషయమై ఏబీసీలకు అందజేయడం జరిగింది . జిల్లాలో సుమారుగా పోస్టుమెట్రిక్ , ప్రీమెట్రిక్ లో ఉన్న విద్యార్థులకు గాను 11వేల వరకు కార్డు సిద్దం చేసి , ఏబీసీలకు అందజేస్తున్నాం . ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Govt to issue special identity card to students of BC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0