Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

VINDAM NERCHUKUNDAM REDIO LESSON 25.09.19

VINDAM NERCHUKUNDAM REDIO LESSON 25.09.19.
VINDAM NERCHUKUNDAM REDIO LESSON 25.09.19

*"విందాం - నేర్చుకుందాం"*
*నేటి రేడియో పాఠం*
★ తేది : 25.09.2019
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : "అన్నం"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
అన్నం
〰〰〰〰〰〰〰〰
 బోధనా లక్ష్యాలు:

  • విద్యార్థినీ విద్యార్థులు 
  • తినే అన్నం ఎలా లభిస్తుందో తెలుసుకుంటారు.
  • అన్నం వండడానికీ ఉపయోగించే బియ్యం ఎలా సస్తాయో తెలుసుకుంటారు.
  •  ధాన్యం వండించడానికి రైతులు చేసే కృషిని అవగాహన చేసుకుంటారు.
  •  ఆహార పదార్థాలను వృధా చేయరాదు అని తెలుసుకుంటారు. .
  •  పరిశీలన, సమాచార సేకరణ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు.
  • శారీరక, మానసికోల్లాసం పొందుతారు.

బోధనాభ్యసన సామగ్రి:
1. పాఠ్యపుస్తకం, 2 పాఠ్యచిత్రం గీచిన చార్టు  3. వివిధ రకాల ధాన్యాలు 4, వ్యవసాయ పనిముట్ల నమూనాలు/చిత్రాలు.
ప్రసార పూర్వ కృత్యాలు :
 *కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి*
   ఎ. కృత్య నిర్వహణపై అవగాహన
   బి. ఆట నిర్వహణపై అవగాహన

కృత్యము :1

  • సంభాషణల ద్వారా విన్న పొర్యాంశంపై  రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు తరగతిలోని పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.
  • రాజు, లతలు చెప్పే సమాధానాలతో పిల్లల సమాధానాలు సరి చూసుకొనేలా చేయాలి.

కృత్యము :2:

  • పాఠ్యపుస్తకంలో 42 వ పేజీలోనీ 2 వ "పేరాను పిల్లలు అర్థం చేసుకుంటూ చదవాలి.
  • పిల్లలు చదివిన ఆ 'పేరాకు సంబంధించి రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు తరగతిలోని పిల్లలచే జవాబులు చెప్పించాలి.

కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్ని తెలుసుకొని ఉండాలి
ఆట :1:

  • పిల్లలందరూ వారి స్థానాల్లోనే నిలబడి ఉండాలి.
  • ఆటలో భాగంగా పిల్లలు రేడియో టీచర్ చెప్పిన విధంగా అభినయించాలి.
  • 1. నాగలితో దున్నుతున్నట్లుగా   
  • 2. నారుమడి నుండి వరినారు పీకుతున్నట్లుగా 
  •  3.నరినాటు వేస్తున్నట్లుగా  
  •  4. పైరుపై పురుగుమందు స్ప్రే చేస్తున్నట్లుగా   
  • 5. వరికోత కోస్తున్నట్లుగా 
  •   6. ధాన్యాన్ని బస్తాలలో పోస్తున్నట్లుగా.
  • రేడియో టీచర్ చెప్పే పదాలను టీచర్ నల్లబల్లపై రాయాలి. 
  • పిల్లలచే ఆ పదాలకు అర్థాలు చెప్పించి. సొంత వాక్యం చెప్పించాలి.
  • 1. కడుపులో   2. నిర్లక్ష్యం
  • రేడియో టీచర్ చెప్పే పదాలను టీచర్ నల్లబల్ల పై రాయాలి.
  •  వాటికి పిల్లలచే వ్యతిరేక పదాలు చెప్పించి.సొంత వాక్యాలు చెప్పించాలి.
  • 1. తేలిగ్గా  2. వృధా
  • రేడియో టీచర్ చెప్పే పదాలను టీచర్ నల్లబల్లపై రాయాలి. 
  • వాటికి వచనం మార్చి సొంత వాక్యాలు చెప్పించాలి.
  • 1. పొలం 2. వర్షాలు

కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
🎼  *పాట*
🎤 పల్లవి :
వినవమ్మ వినవమ్మ తుమ్మెద
వివరంగ సెబుతాను తుమ్మెద
వరి పండే విధమును తుమ్మెద
వరుసగా జెబుతాను తుమ్మెద   //వినవమ్మ//

🎻 చరణం 1:
పొలమునకు నీరెట్టి తుమ్మెద
నాగలి తోటి దున్ని తుమ్మెద
కర్ర దుంగతో దాన్ని తుమ్మెద
చదునుగ జేస్తారు తుమ్మెద
విత్తనాలను జల్లి తుమ్మెదా...
నారు పెంచేస్తారే తుమ్మెద

🎻 చరణం 2:
నారు మడి నుండి తుమ్మెద
పీకిన నారును తుమ్మెద
దమ్ము చేసిన చేలో తుమ్మెద
నాటుగ వేస్తారు తుమ్మెద
ఎరువులు జల్లేసి తుమ్మెదా....
నీరు పెట్టేస్తారు తుమ్మెద

🎻 చరణం 3:
దుబ్బు చేస్తున్నపుడు తుమ్మెద
కలుపు మొక్కలు పీకి తుమ్మెద
ఎరువులు జల్లేసి తుమ్మెద
పురుగుమందులు వేసి తుమ్మెద
చంటి బిడ్డాలెక్క తుమ్మెదా...
పైరు పెంచేస్తారే తుమ్మెద

🎻 చరణం 4:
పైరు పొట్టకొచ్చి తుమ్మెద
గింజ ముదిరి నాక తుమ్మెద
కోతలు కోస్తారు తుమ్మెద
కుప్పలుగ వేస్తారు తుమ్మెద
నూర్పిళ్ళు జేస్తారే తుమ్మెదా...
తూర్పార బోస్తారే తుమ్మెద

🎻 చరణం 5:
ధాన్యపురాశిని తుమ్మెద
బస్తాలలో నింపి తుమ్మెద
ఎడ్ల బండ్లపైన తుమ్మెద
ఇళ్ళకు దెస్తారు తుమ్మెద
తిండి పెట్టే రైతు తుమ్మెదా
మనకు దేవుడౌతాడమ్మ తుమ్మెద
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "VINDAM NERCHUKUNDAM REDIO LESSON 25.09.19"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0