Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation on how to recover lost identity cards

మనం పోగొట్టుకున్న గుర్తింపు కార్డులను తిరిిగి పొంద‌డం ఎలా?
Explanation on how to recover lost identity cards

విలువైన ప‌త్రాలు పోతే మ‌ళ్లీ పొందే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్ర‌త్యేక వెబ్ సైట్లు ఉన్నాయి. అందులో స‌మ‌స్త స‌మాచారం ఉంటుంది.
ఇప్పుడు ప్ర‌తి పౌరుడికి ఓట‌రు గుర్తింపు కార్డు, ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. వాహ‌నాలు న‌డిపే వారికి డ్రైవింగ్ లైసెన్సు కావాల్సిందే. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌స్తుందో క‌చ్చితంగా తెలియ‌క చాలా మంది ఈ కార్డుల‌ను ప‌ర్సులో, బ్యాగులో వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అజాగ్ర‌త్త వ‌ల్ల‌నో, ఆద‌మ‌రిచో ఒక్కో సారి ప‌ర్సు పోగొట్టుకుంటారు. ఇల్లు మారుతున్న‌ప్పుడు హ‌డావిడ‌లో ముఖ్య‌మైన డాక్యుమెంట్లు పోగొట్టుకుపోవ‌చ్చు. అలాంటివి పోయినా మ‌ళ్లీ తిరిగి పొంద‌వ‌చ్చ‌నే విష‌యం తెలియ‌క ఎక్కువ మంది కంగారు ప‌డుతుంటారు. ఇంత‌టి విలువైన ప‌త్రాలు పోతే మ‌ళ్లీ పొందే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్ర‌త్యేక వెబ్ సైట్లు ఉన్నాయి. అందులో స‌మ‌స్త స‌మాచారం ఉంటుంది. అవేంటో ఈ కింది క‌థ‌నంలో తెలుసుకుందాం.
Explanation on how to recover lost identity cards

ఆధార్‌ కార్డుఈ కార్డు పోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 

18001801947 కు కాల్‌ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి.ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డు మళ్టీ పోస్టులో పంపిస్తారు. help@uidai.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన సెంటర్‌లలో పుట్టిన తేదీ తప్ప మరే ఇతర సమాచారమైనా సరైన ఆధారాలను చూపించి మార్చుకునే అవకాశం ఉంది.

పాన్‌ కార్డు

ఆర్థిక లావాదేవీలలో పాన్‌ కార్డు ప్రస్తుతం చాలా కీలకం. ఆదాయపు పన్ను శాఖ అందజేసే పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటూ పాత పాన్‌కార్డు జిరాక్స్‌, రెండు కలర్‌ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం మరో 90 రూపాయలు చెల్లించాలి. కొత్త కార్డు మంజూరుకు మూడు వారాల సమయం తీసుకోవచ్చు.tin.tin.nsdl.com

రేషన్‌ కార్డు

కుటుంబ అవసరాలకు ఈ కార్డు చాలా కీలకం.కేవలం ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువుల కోసమే కాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌ కార్డును కీలక ఆధారంగా అడుగుతుంటారు.తెల్లకుర్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా కల్పిస్తోంది. అందువల్ల పేదప్రజలజీవితంలో ఈ కార్డుకు ప్రాధాన్యత ఎక్కువ.రేషన్‌ నంబర్‌తో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించడం ద్వారా పరిశీలన జరిపిన అధికారులు అదే నంబర్‌పై నామమా త్రపు రుసుముతో కార్డు జారీ చేస్తారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌

వాహనం నడిపేందుకు తప్పనిసరిగా ఉండాల్సింది డ్రైవింగ్‌లైసెన్స్‌. ఈ కార్డు పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ సర్టిఫికేట్‌తో పాటూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని లాస్‌ ఆర్‌ డిస్ట్రక్షన్‌ అఫ్‌ లైసెన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ ఫర్‌ డూప్లికేట్స్‌ ఫారమ్‌, ఎల్‌ఎల్‌డితో రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో అందించాలి. అలాగే పది రూపాయల బాండ్‌ పేపర్‌ పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. తిరిగి కార్డును పొందడానికి సుమారు ముఫ్పై రోజుల సమయం పట్టవచ్చు. Aptransport.org అనే వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ఎల్‌ డి ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.

ఏటీఎం కార్డు

ఈ కార్డు కోల్పోయిన వెన్వెంటనే సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేసి, వారడిగిన సరైన, పూర్తి సమాచారం అందించి కార్డును బ్లాక్‌ చేయించాలి. తరువాత మీరు పొందే ఫిర్యాదు నంబర్‌ను సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు తెలియజేయాలి.ఈ విషయాన్ని నిర్ధారించుకున్న అధికారులు కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకులు నిర్ణీత మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారు.

పాస్‌పోర్ట్‌

పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి, లభించ కపోతే నాన్‌ట్రేస్డ్‌ ధ్రువపత్రం జారీ చేస్తా రు. అనంతరం పాస్‌పోర్టు అధికారి, హైదరా బాద్‌ పేరిట 1000 రూపాయలు డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయాధికారి విచారణ జరిపి, డూప్లికేట్‌ పాస్‌పోర్టు జారీ చేస్తారు. మూడు నెలల సమయం పట్టవచ్చు. తత్కాల్‌ పాస్‌పోర్టు అయిన పక్షం లో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. www.passportindia.gov.in వెబ్‌సైట్‌ సంప్రదించండి.

ఓటరు గుర్తింపు కార్డు 

ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్‌తో రూ.10 చెల్లిస్తే మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in వెబ్‌సెట్‌ను సందర్శించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation on how to recover lost identity cards"

Post a comment