Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Post Office Monthly Income Scheme

ప్రతీ నెలా ఆదాయం కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
Post Office Monthly Income Scheme | మీకు ప్రతీ నెలా కొంత ఆదాయం కావాలా? మీ దగ్గరున్న డబ్బును భద్రంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఆప్షన్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్ వివరాలేంటో తెలుసుకోండి.
Post Office Monthly Income Scheme
ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు
  •  పోస్ట్ ఆఫీస్... కేవలం పోస్టల్ సేవలు పొందడం మాత్రమే కాదు... ఎన్నెన్నో పొదుపు పథకాలనూ పొందొచ్చు. 
  • కేవలం పల్లెల్లోనే కాదు... పట్టణాల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లో డబ్బు పొదుపు చేసేవాళ్లున్నారు. 
  • ఇలాంటివారి కోసం అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తోంది ఇండియా పోస్ట్
  •  పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో ఒకటి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. 
  • అంటే నెలనెలా ఆదాయం పొందే పథకం అని అర్థం.
  •  ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినవాళ్లు నెలనెలా వడ్డీ పొందొచ్చు.
  • రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును పొదుపు చేసి ప్రతీ నెలా వడ్డీ పొందాలనుకునేవారికి ఎంతో ఉపయోగకరమైన పథకం ఇది. 
  • కొద్ది రోజుల క్రితం ఈ స్కీమ్ వడ్డీ రేట్లు కూడా మారాయి.
  • పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరు మీద కూడా అకౌంట్ తెరవచ్చు. 
  • 10 ఏళ్లు దాటిన మైనర్ అయితే అకౌంట్‌ను సొంతగా ఆపరేట్ చేసుకోవచ్చు. 
  • ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు.
  • జాయింట్ అకౌంట్ హోల్డర్లకు అకౌంట్‌లో సమాన వాటా లభిస్తుంది. సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా, జాయింట్ అకౌంట్‌ను సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. 
  • ఈ అకౌంట్‍కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది. 
  • మీరు ఒక పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తెరిస్తే మరో పోస్ట్ ఆఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు.
  • పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ.4.5 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు
  • ఈ స్కీమ్‌లో 2019 జూలై 1 నుంచి నెలకూ 7.6​% వడ్డీ ఇస్తోంది ఇండియా పోస్ట్. 
  • వడ్డీ నెలనెలా సేవింగ్స్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. కనీసం ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
  • ఏడాది తర్వాత 3 ఏళ్ల లోపు డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే 2%, మూడేళ్ల తర్వాత ఐదేళ్ల లోపు తీసుకుంటే 1% తక్కువగా డబ్బులు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఈ స్కీమ్‌కు ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను లాభాలు పొందొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Post Office Monthly Income Scheme"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0