Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Posting within the own zone for Secretariat employees.

 సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే పోస్టింగ్.
“ సచివాలయ ' ఉద్యోగులకు విధివిధానాలు ఖరారు .
మూడు ప్రాంతాలను ఎంచుకునే అవకాశం.
Posting within the own zone for Secretariat employees.

గ్రామ , వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమి ంచాలని నిర్ణయించింది . ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా . . జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు . పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించబోతోంది . సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల ( డీఎస్సీ ) ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు . ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది . దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది , కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకుఆదివారం ఆదేశాలు జారీ చేశారు . ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్పీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు . వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు . వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇస్తారు . ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు , మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు .

ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు.

 గ్రామ , వార్డు సచివాలయ రాతపరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీన ( సోమవారం ) జిల్లా కేంద్రాల్లో అపాయింటిమెంట్ లెటర్లు అందజేస్తారు . విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు . జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింటిమెంట్ లెటర్లు అందజేస్తారు . అపాయింటమెంట్ లెటర్ అంటే అభ్యర్ధి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని , సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు . 

సీఎం కార్యక్రమ షెడ్యూల్ 

విజయవాడలోని ' ఎ ' ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జిల్లాలో గ్రామ , వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికై , కార్యక్రమానికి ఆహ్వానం ఆందినవారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది . ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు . సచివాలయ ఉద్యోగులకు లాంఛనప్రాయంగా నియామక పత్రాలు అందజేసిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు . ఇలా ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు వీలుగా అధికారులు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Posting within the own zone for Secretariat employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0