Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postpone strike by banks

26, 27 తేదీల్లో యధావిధిగా కార్యకలాపాలు
ఈ నెల 26, 27 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్లు చేయతలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నుంచి హామీ లభించటంతో ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు అధికారుల సమాఖ్యలు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్‌ను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంక్‌ ఆఫీసర్స్‌ సమాఖ్య (ఏఐబీఓఏ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌బీఓసీ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఓబీఓ) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Postpone strike by banks
సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌తో ఈ సమాఖ్యలకు చెందిన ప్రతినిధుల బృందం భేటీ అయింది. బ్యాంకు అధికారుల సమాఖ్యలు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాజీవ్‌ కుమార్‌ సుముఖత వ్యక్తం చేయటంతో సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు నాలుగు సంఘాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. సమ్మె విరమణతో బ్యాంకు కార్యకలాపాలు యధావిధిగాసాగుతాయని తెలిపాయి.

ఖాతాదారులతో విలీన బ్యాంక్‌ చైర్మన్ల సమావేశం

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ విలీనానికి సంబంధించి ఆయా బ్యాంకుల మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓలు.. ఖాతాదారులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ జె పాకిరి సామి, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పీవీ భారతి, యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విలీనం కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఈ సందర్భంగా వారు వివరించారు. బ్యాంకు కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. కాగా ఖాతాదారులతో సమావేశమైన అనంతరం బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో వీరు భేటీ కావాల్సి ఉంది. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అధికారులు, ఉద్యోగులు వీరితో సమావేశమయ్యేందుకు నిరాకరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postpone strike by banks"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0