Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rediyo Lesson Vinadam Nerchukunna am 04.09.2019

"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
Rediyo Lesson Vinadam Nerchukunna am 04.09.2019
  •  తేది : 04.09.2019
  •  విషయము : పరిసరాల విజ్ఞానం
  •  పాఠం పేరు : "మన గ్రామం"
  •  తరగతి : 3వ తరగతి
  •  సమయం : 11-00 AM 
  • నిర్వహణ సమయం : 30 ని.లు

మన గ్రామం

బోధనా లక్ష్యాలు:
  • విద్యార్థినీ విద్యార్థులు :
  • మన గ్రామం ఏమిటో తెలుసుకుంటారు.
  • గ్రామంలో ఉండే సమస్యల గురించి తెలుసుకుంటారు.
  • గ్రామ పంచాయితీ వీధుల గురించి తెలుసుకుంటారు.
  •  గ్రామానికి గల రవాణా సౌకర్యాల గురించి తెలుసుకుంటారు.
  • గ్రామంలో గల వివిధ వృత్తుల వారి గురించి తెలుసుకుంటారు.

బోధనాభ్యసన సామగ్రి:

  • సామాజిక సంస్థల పేర్లు, వాటి విధులు రాయబడిన చార్టు.
  •  సామాజిక సంస్థల పేర్లు రాయబడిన చీటీలు.
  • పాఠ్యపుస్తకం.
  • గ్రామంలోగల ప్రార్థనామందిరాల చార్డు. 
ప్రపార పూర్వ కృత్యాలు:
 కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.

కృత్యం-1:సామాజిక సంస్థలు -- వాటి విధులు

ఒక చార్టులో క్రింది విధంగా రాసి పెట్టుకొని కృత్యం చేసే సమయంలో బోర్డుపైఅంటించాలి.
1. గ్రామ పంచాయితీ  ( )  ఎ. నీటిని నిల్వ చేసేది
2. పోస్టాఫీసు  ( )  బి. డబ్బును దాచే స్థలం
3. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ( )  సి. పశువులకు వైద్యం         చేసేది
4. పశు వైద్యశాల  ( )  డి. చదువు నేర్పే స్థలం
5. బ్యాంకు  ( )  ఉత్తరాలను చేరవేయడం
6. పాఠశాల  ( )  దేవుడు ఉండే స్థలం
7. వీళ్ళు ట్యాంకు  ( )  మనుషులకు వైద్యం చేసేది
8. ప్రార్థనా మందిరం ( ) వీధులు శుభ్రం చేయడం

కృత్యం-2:ఆట

ఈ కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్నీ తెలుసుకొని ఉండాలి.
ఆట ఆడించే విధానం :
  • తెల్ల కాగితాన్ని 8 చీటీలుగా చించి, ఒక్కొక్క చీటీ పై ఒక్కొక్క సామాజిక సంస్థ పేరును రాయాలి.
  • ఇలా 3 సెట్లు చీటీలను సిద్ధంగా ఉంచుకోవాలి
  • ఆ మూడు సెట్ల చీటీలలో ఒక దానిని నల్లబల్ల వద్ద; రెండవ సెట్ చీటీలను తరగతి గది మధ్యలో, మూడవ సెట్ చీటీలను తరగతి గదిలో చివరన ఉంచాలి.
  • ఆ మూడు సెట్ల చీటీలను అభిముఖంగా విద్యార్థులను రెండువరుసలలో నిలబెట్టాలి.
  •  రేడియో టీచర్ ఏదైనా ఒక సామాజిక సంస్థ పేరు చెపుతుంది.
  • రెండు వరుసలలోని విద్యార్థులు మూడు సెట్లలో గల ఆ సామాజిక సంస్థ పేరు గల చీటిని వెదికి టీచర్ కి ఇవ్వాలి.
  • రేడియోలో గంట శబ్దం వినిపించగానే వెదకడం ఆపివేయాలి.
  • చీటీలను వెదికే సమయంలో పిల్లల మధ్య తోపులాట జరుగకుండా చూడాలి.

కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.

పాట
     పల్లవి :
గ్రామాలన్నింటిలో ప్రత్యేకం
మన రంగాపురం గ్రామం
సకల సేవల సౌకర్యం
సమస్త పల్లెలకు ఆదర్శం   //గ్రామాల//
చరణం 1:
చిన్న చిన్న కొండలతో
నదీనీరు పాగుతుండగా
ప్రకృతిమాత ఒడినిండగా
పచ్చదనంతో పర్వసించేమగా  //గ్రామాల//
చరణం 2:
కష్టనష్టాలు ఎన్నున్నా
ఒకరి కొకరు తోడుగా
పగలు రాత్రి ఎప్పుడైనా
సమన్వయంతో  సాగెనుగా  //గ్రామాల//
చరణం 3:
 అనేక వృత్తుల వారున్నా
భిన్న కులాలు  ఎన్నున్నా
గ్రామాభివృద్ధికై ఐక్యతాభావం   //గ్రామాల//
పాట ప్రసార సమయంలో
 మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rediyo Lesson Vinadam Nerchukunna am 04.09.2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0