Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills


Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills.
  •  ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్ణయం.
  •  తొలుత తెలంగాణలో క్రమంగా ఏపీలో కూడా విస్తరించాలని సంస్థ ప్రణాలిక..
  •  వారంలో రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ..
Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills


 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాద్యం యులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీ సెస్ 
( టీసీఎస్ ) నిర్ణయించింది . విద్యాబోధనను మరింత ఆకర్షణీ యంగా , సమర్ధంగా చేయడంతో పాటు పాఠశాల నిర్వహణ విదు లను సులభతరం చేయడం వల్ల బోధన పైనే దృష్టి సారించేందుకు ఉపాధ్యాయులు , ప్రధానోపాధ్యాయులకు వీలవుతుందని సంస్థ పేర్కొంది . ప్రభుత్వంతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సీఐఐ ) ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది . తొలుత తెలంగాణా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడు తుండగా , క్రమంగా అంధ్రప్రదేళకు కూడా విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక . వారంలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉంటుంది . పాఠ్యాంశాల బోధన ( థియరీ ) తో పాటు ల్యాబ్లో ప్రాక్టికల్ శిక్షణ కూడా ఉంటుంది . ఇందుకోసం 100 మంది వాలం టీర్ల ( సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ) ను టీసీఎస్ కేటాయిస్తోంది . మొత్తం 500 మంది వాలంటీర్లు కావాలి కనుక ఇతర సాఫ్ట్ వేర్ సంస్థలనూ భాగస్వాములను చేస్తామని పేర్కొంది . తొలివిడతగా హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లోని 61 మంది ఉపాధ్యాయులకు శిక్షణను శనివారం హైదరాబాద్లోని టీసీఎస్ సీనరీ పార్కులో ప్రారంభించారు . ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు 5000 మంది ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలన్నది తమ ప్రణాళిక అని టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి . రాజన్న తెలిపారు . రాష్ట్రంలోని 33 జిల్లాల పాఠ శాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని , ప్రతి పాఠశాల నుంచి ఆసక్తి కలిగిన చురుడైన ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలిని ఎంపిక చేసే బాధ్యత విద్యాశాఖ అధికారులదేనని వివరించారు . హైదరాబాద్ సమీపంలోని వారికి టీసీఎస్ ప్రాంగణంలో , ఇతర ప్రాంతాల వారికి ఆ సమీప ఇంజినీరింగ్ కళాశాలలు , ఐఐఐటీ వంటి ఉన్నత విద్యాసం స్థలను ఇందుకోసం వినియోగిస్తామన్నారు . వీరితో అనుసంధాన బాధ్యతలను సీఐఐ చూసుకుంటుంది . 

ఈ అంశాల్లో శిక్షణ 

ఎంఎస్ ఆఫీస్లోని వర్డ్ , పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎక్సెల్షీట్తో పాటు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు మెయిల్ ద్వారా ఎలా సమర్థంగా రాయాలో తెలుపుతారు . విద్యార్ధులకు సిలబస్ ప్రణాళిక , టైమ్టేబుల్ , హాజరు , మార్కుల పట్టికలు , పాఠశాల సిబ్బంది వేతన పట్టికలు రూపొందించడం బాగా సులువవుతుందని వివరించారు . 

500 మందికి పీహెచ్డీ ప్రాయోజితం 

దేశంలో డాక్టరేట్ల సంఖ్య పెంచేందుకు , తద్వారా పరిశోధనల వృద్దికి టీసీఎస్ కట్టుబడి ఉందని రాజన్న తెలిపారు . 2010లో తమ సీఈఓ ప్రకటించిన ఈ పథకం కింద వరంగల్ ఎన్ఐటీ నుంచి ఇద్దరు , హైదరాబాద్ ఐఐఐటీ నుంచి 22 మంది వినియోగించుకున్నా రని వివరించారు . తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోని ఆరులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు . వారికి సైపు డితో పాటు పేపర్ ప్రెజెంటేషన్ కోసం సంబంధిత సమావేశాలకు హాజరయ్యేందుకు ఖర్చులను కూడా టీసీఎస్ భరిస్తుందన్నారు . 

స్వచ్ఛభారత్ నిధుల్లో అధికం మనకే 

ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కింద ఆడపిల్లల పాఠ శాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి తమ గ్రూప్ కేటాయించిన రూ . 100 కోట్లలో అధికశాతం నిధులను తెలుగు రాష్ట్రాలకే వినియోగం చినట్లు రాజన్న తెలిపారు . 1500 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయి , నిర్వహణ బాధ్యతలు కూడా తామే చేపట్టినట్లు వివరించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tata Consultancy Services' decision to train government high school teachers in IT skills"

Post a comment