Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education department makes efforts to change the cover of schools

పాఠశాలల ముఖచిత్రాల మార్పునకు విద్యాశాఖ కసరత్తు..

  • పాఠశాలల ముఖచిత్రాల మార్పునకు విద్యాశాఖ కసరత్తు.
  • మౌలిక వసతులు కల్పనకు ప్రణాలిక.
  • నాడు-నేడు పేరిట రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి చర్యలు.

రాష్ట్రంలోని పాఠ శాలల ముఖచిత్రాలను మార్చాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా విద్యాశాఖ అధికా రులు కసరత్తు ప్రారంభించారు . ఇందుకోసం ఇ ప్పటికే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ముఖ చిత్రాలను సేకరించి ఒక యాప్లో పొందుప రిచారు . రాష్ట్రంలోని పాఠశాలలన్నింటికీ కలిపి దాదాపు పది లక్షలకు పైగా ఫొటోలను సేకరించి డేటా సిద్ధం చేశారు . ' నాడు - నేడు ' పేరిట రాష్ట్రంలోని 44 వేల 512 పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది . తొలివి డతలో 15 వేల 410 పాఠశాలలను ఎంపిక చేసి “ నాడు - నేడు ' కింద 9 రకాల కనీస వసతులను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది . ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రూ . 33 వేల కోట్ల బడ్జెట్లు కేటాయించడంతో పాటు అసెం బ్లీలో సైతం పాఠశాలల ముఖచిత్రాలను మార్చి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో ఇటీవల విద్యాశాఖముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు , సివిల్ వర్క్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు . తొలి విడతలో అభివృద్ధి చేయాల్సిన 15 వేల 410 పాఠశాలల్లో ఉన్న వ సితులేంటి , అదనంగా కల్పించాల్సిన వసతులేమి టనే ఆంశాలపై చర్చించారు .

 మార్చినాటికి మొదటి విడతపూర్తి 

ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యేలోగా తొలివిడతలో అభివృద్ధి చేయాలని సంకల్పించిన పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిం చేందుకు విద్యాశాఖ నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది . వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని , తద్వారా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలనే లక్ష్యాన్ని విద్యాశాఖ నిర్దేశించుకుంది . విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్ సైతం పాఠశాలల ముఖచిత్రాలను మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రకటించారు . ఈ నేపథ్యంలో మార్చి 14 నాటికి మొదటి విడతలో ముఖచిత్రాలు మార్చాలని నిర్ణయించిన 15 వేల 10 పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు . ఆలాగే ఈ పాఠశాలల్లో పంచాయతీరాజ్ , మున్సిపల్ , ట్రైబల్ వెల్ఫేర్ , సోషల్ వెల్ఫేర్ , వీసీ వెల్పేర్ తదితర విభాగాల ఆధ్వర్యంలో నడిచే అన్ని పాఠశాలలు తొలి విడత అభివృద్ధి చేయాల్సిన వాటిలో ఉండేలా చేశారు . 

" పేరెంట్ కమిటీల పర్యవేక్షణలో . . అభివృద్ధి

 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పేరెంట్ కమిటీల భాగస్వామ్యం కల్పించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది . ఈ నెల 28న పేరెంట్ కమిటీల ఎన్నికలు నిర్వహించనుండటంతో . . పూర్తయిన వెంటనే ప్రతి ఒక్క పాఠశాలలో కమిటీలతో విద్యాశాఖ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు . ఎక్కడిక్కడ స్థానిక అవసరాలను బట్టి నిధులు కేటాయించడంతో పాటు త్వరితగతిన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్ట నున్నారు . ' నాడు - నేడు ' లో పేరెంట్ కమిటీల భాగస్వామ్యం వల్ల బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన తీసుకురావాలని ముఖ్యమంత్రి గతంలో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు . పేరెంట్ కమిటీలతో పాటు పూర్వ విద్యార్థు లను సైతం పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాము లను చేయాలని విద్యాశాఖ అధికారులు భావి స్తున్నారు . ఇందుకోసం ఇటీవల సర్వ శిక్షా అభి యాన్ రాష్ట్ర కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ నేతృత్వంలో ఎస్పీడీ చినవీరభద్రుడు , చీఫ్ ఇంజనీర్ కె . శ్రీనివాసరావు , సివిల్ వర్క్ ఇంజనీర్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సమావేశం| నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులు కల్పించేందుకు అవసరమైన బడ్జెటపై చర్చించడంతో పాటు , చేపట్టాల్సిన పనులపై విస్తృతంగా చర్చించారు . మరోవైపు విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామ , మండల , జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు . ఒక పక్కన అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తూనే . . మరోపక్క టీచర్లకు ఇంగ్లీష్ బోధనలో శిక్షణనివ్వడం , జనవరి నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియ చేపట్టడం వంటివి పూర్తి చేసివచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది . అలాగే రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకు తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్దమవుతున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education department makes efforts to change the cover of schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0