Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The growing horn on the head of an old man .. What is the reason ?

వృద్ధుడి తలపై పెరుగుతున్న కొమ్ము.. కారణం ఇదే.
మనిషికి కొమ్ములు రావడాన్ని ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా? ఓ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి తలకు ఇలా కొమ్ము మొలిచింది. ఎందుకంటే..
The growing horn on the head of an old man .. The reason is the same

ఓ వ్యక్తి తలకు గాయమైంది. కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము మొలిచింది. అది రోజు రోజుకు పెద్ది కావడంతో ఆ వ్యక్తి వైద్యులను ఆశ్రయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. రాహ్లీ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల శ్యామ్‌లాల్ యాదవ్‌ కొన్నేళ్ల కిందట ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడి తలకు గాయమైంది.
చికిత్స జరిగిన కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము పెరగడం మొదలైంది. దీంతో అతడే ఆ కొమ్మును కత్తిరించుకొనేవాడు. అయితే, అది ఇంకా పెద్దది కావడంతో శ్యామ్‌లాల్ వైద్యులను సంప్రదించాడు. అయితే, వైద్యులు కూడా దీనికి పరిష్కారం చూపలేకపోయారు. చివరికి భాగ్యోదయ్ తీర్థ్ ఆసుపత్రిలో ఆ కొమ్మును తొలగించారు.
శ్యామ్ లాల్‌కు వైద్యం చేసిన డాక్టర్ విశాల్ గజభియే మాట్లాడుతూ.. బాధితుడు సేబాషియస్ హార్న్ (కొవ్వు కొమ్ములుగా ఎదగడం) సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. శరీరంలో సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఇవి ఏర్పడతాయని, దీన్ని డెవిల్స్ హార్న్ అని కూడా అంటారన్నారు. ఎక్స్‌రేలో అతడి కొమ్ము మూలాలు పూర్తిగా శరీరంలోకి చొచ్చుకెళ్లలేదని గుర్తించామని, అందుకే దాన్ని సులభంగా తొలగించామని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The growing horn on the head of an old man .. What is the reason ?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0