Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The most obvious of which is not yet on the tenth grade examination system


  • టెన్త్ పరీక్షల విధానంపై అయోమయం !
  • విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా లేని స్పష్టత
  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపని వైనం. 
  • టీచర్లు , విద్యార్థుల్లో గందరగోళం  

The most obvious of which is not yet on the tenth grade examination system

 విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటుతున్నా పదో తరగతి పరీక్షలను ఈసా ఎలా నిర్వహిస్తారో విద్యా శాఖ ప్రకటించకపోవడంపై టీచర్లు , విద్యార్థుల్లో విస్మయం వ్యక్తమవుతోంది . ఇప్పటివరకు పరీక్షల విధానం ఖరారు కాకపోవడంతో పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు . మరోవైపు ఎలా చదవాలో అర్ధం కాక విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు .

కార్పొరేట్ అక్రమాలతో ఇంటర్నల్ మార్కులు రద్దు 

ఈ ఏడాది ( 2019 మార్చి / ఏప్రిల్ ) వరకు ప్రశ్నపత్రానికి 80 మార్కులు , ప్రాజెక్టులు , ఇతర కృత్యాలకు 20 ఇంటర్నల్ ( అంతర్గత ) మార్కులు కేటాయించి పదో తరగతి పరీక్షలు నిర్వహించారు . అయితే . . ఈ ఇంటర్నల్ మార్కులు కేటాయింపులో కార్పొరేట్ , ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేస్తున్నారని . . ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి . దీంతోపాటు ప్రైవేటు పాఠశాలలు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి . దీంతో ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జూన్లో జీవో జారీ చేసింది .

SCERT ప్రతిపాదనలు ఇవి . 

  •  టెన్త్ లో 20 శాతం అంతర్గత మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసినందున హిందీ , సంస్కృతం మినహాయించి ప్రతి సబ్జెలు 100 మార్కులకు ( 50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు ) ఉంటుంది .
  •  ప్రతి పేపర్లో నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు . 
  • ఇంతకుముందు ప్రతి పేపర్లో పది మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా బీట్ పేపర్ ఉండగా తాజాగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు . 
  • వాటి స్థానంలో ఏకవాక్య సమాధానాల ప్రశ్నలు ఇవ్వనున్నారు . . గతంలో మాదిరిగానే 2 , 3 గంటలు పరీక్ష రాయడానికి , 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఇవ్వనున్నారు . 
  • సంస్కృతం , హిందీ పేపర్లు 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు , ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు సమయమిస్తాడు .
  •  ఆయా సబ్జెక్టుల రెండు పేపర్లలో ప్రతి పేపర్లోనూ 17.5 మార్కులు రావాలి . 
  • ఇలా రెండు పేపర్లకు కలిపి కనీసం 35 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులైనట్టుగా పరిగణిస్తారు . 
  • ఈ మేరకు మార్కుల మెమోల్లో కూడా మార్పులుంటాయి . గ్రేడింగ్ విధానం యధాతధంగా ఉంటుంది.
  •  కాపీయింగను నివారించడానికి ఇంటర్మీడియట్ తరహాలో 2 నుంచి 16 పేజీలుండే బుక్లెట్ ను అందించాలని ప్రతిపాదించారు .

నెల క్రితమే బ్లూ ప్రింట్ ఖరారైనా . 

  • ప్రభుత్వ జీవోతో రాష్ట్ర విద్యా పరిశోధన క్షణ మండలి
  •  ( SCERT) నెల క్రితమే పరీక్షల విధానాన్ని మాదిరి ప్రశ్నపత్రాలను , బ్లూప్రింటను రూపొందించింది .
  •  దీన్ని పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి పంపించి ఆమోదం పాందీ . . జీవో విడుదల చేయించాలి .
  •  ఎస్ సీఈఆర్టీ ప్రతిపాదనలు సమర్పించినా పాఠశాల విద్యా శాఖ మాత్రం ప్రభుత్వానికి పంపడానికి మీనమేషాలు లెక్కిస్తోంది . 
  • వేసవి సెలవుల్లోనే ప్రకటించాల్సిన పరీక్షల విధానాన్ని నాలుగు నెలలైనా ఖరారు చేయకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు గత రెండు నెలల నుంచే నిరసన వ్యక్తు చేస్తున్నాయి . 
  • అయినా అధికారులు పట్టించుకోవడం లేదని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

కొత్త ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు.

  • ఎస్ సీఈఆర్టీ ప్రతిపాదించిన టెన్త్ పరీక్షల ప్యాట్రన్ పై టీచర్ల సంఘాల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ,
  •  రెండు పేపర్లున్న సబ్జెక్టుల్లో ప్రతి పేపర్లోనూ 17 . 5 మార్కులు రావాలనే నిబంధన వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతారని అంటున్నాయి . 
  • అదేవిధంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల నేపథ్యంలో బిట్ పేపరను ఉంచాలని కోరుతున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The most obvious of which is not yet on the tenth grade examination system"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0