Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vimdaam Nerchukundaam Radio Lesson 11.09.19 Wednesday

Vimdaam Nerchukundaam Radio Lesson 11.09.19 Monday

మీ పాఠశాలలో రేడియో లేదా? అయితే మొబైల్ లో ఇలా రేడియో పాఠం వినిపించండి
Vimdaam Nerchukundaam Radio Lesson 11.09.19 Wednesday  రేడియో పాఠం

 తేదీ:11-09-19

 పాఠం పేరు:సహకారం

 తరగతి:3

 విషయం:తెలుగు

 సమయం:11am

11-9-19
💁‍♂ *"విందాం - నేర్చుకుందాం
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 11.09.2019
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : "సహకారం"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11-00 AM 
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *సహకారం* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• సంభాషణలు ద్వారా గేయాన్ని అవగాహన పరచడం
• గేయ కథను సొంత మాటల్లో చెప్పించుట
• పిల్లలు కథను స్వంత మాటల్లో రాయగలగడం
• పిల్లల్లో దయాగుణం పెంపొందింప జేయుట
• పిల్లల్లో అభినందన విలువలు పెంపొందింప జేయుట
• పిల్లలకు సహకారభావం అలవాటు చేయుట .
• ఏకవచన,బహువచన రూపాలు,సొంత వాక్యప్రయోగాల ద్వారా పదజాలాభివృద్ధికి కృషి చేయటం.
• పిల్లల్లో కళాకౌశలాన్ని పెంపొందింపజేయటం,
• పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయుట
• ఆట,పాటల ద్వారా శారీరక మానసికోల్లాసాలను కలిగించుట
★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• పాఠ్య పుస్తకం
• పిల్లల నోటు పుస్తకాలు,
• సుద్దముక్కలు
★★★★★★★★
✡ *బోధనాభ్యసస కృత్యాలు :*
*ఆట: కార్యక్రమంలో నిర్వహించబోయే 'ఆట'ను ఆడించే విధానం గురించి తెలుసుకొని ఉండాలి.*
• పిల్లల పుస్తకాల బ్యాగులన్నీ గదిలో ఒక ప్రక్కకు పెట్టించాలి
• గది మధ్యలో సుద్ద ముక్కతో ఒక పెద్ద వృత్తం గీయాలి
• పిల్లలందరూ వృత్తం పై నిలబడాలి
• రేడియో టీచర్ స్టాప్ అని చెప్పి మ్యూజిక్ ఆపివేయగానే ఇద్దరిద్దరు పిల్లలు జతలు,జతలుగా వృత్తంలోకి వెళ్ళాలి.
• పిల్లలు జతలు:జతలుగా వృత్తంలోకి వెళ్ళిన తరువాత రేడియో టీచర్ చెప్పిన పదానికి ఒక విద్యార్థిచే వచనం చెప్పించాలి.
• పాఠ్యపుస్తకంలోని 55 వ పేజీలోని పదజాలం శీర్షికలో ‘అ’ విభాగంలోని జంట పదాలను అలాగే నల్లబల్లపై రాయాలి.
• పిల్లలు జతలు జతలుగా ఏర్పడిన తరువాత రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థిగా ఒక జత 
పదాలు చెప్పించాలి.
• ఆ విద్యార్థి చేత ఆ పదాలతో సొంతంగా ఒక వాక్యం చెప్పించాలి
• ఉదా: కుందేలు కాలినొప్పితో లబలబ మొత్తుకుంది.
★★★★★★★★
✡ *కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.* 
*కృత్యము :1:* 
• సంభాషణల ద్వారా విన్న పాఠ్యాంశంపై రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు, విద్యార్థులతో సమాధానం చెప్పించాలి
• పిల్లలు తాము చెప్పిన సమాధానాలను లత, 'రాజు' లు చెప్పే సమాధానాలతో సరిపోల్చుకోవాలి.
*కృత్యము :2:*
• పాఠ్యపుస్తకంలో 52 వ పేజిలో గల మొదటి మూడు చరణాలు పిల్లలు అర్థం చేసుకుంటూ చదవాలి.
• చదివిన చరణలలో రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా మూడు అక్షరాల పదాలు,నాలుగు అక్షరాల పదాలు, ప్రాస పదాలు గుర్తించి పిల్లలచే చెప్పించాలి.
• లబలబ మని మొత్తుకుంది ఇలాంటి వాక్యాలు ఫిల్లలచే చెప్పించాలి. కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
★★★★★★★★
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼  *పాట (పాఠం పై గేయం):*
🎤 *పల్లవి :* 
చక్కనైన కుందేలు -చకచకమని గంతులేసె
చక్కనైన కుందేలు -చకచకమని గంతులేసె
పట్టుతప్పి పడిపోయే -కాలేమొ విరిగిపోయే
పట్టుతప్పి పడిపోయే -కాలేమొ విరిగిపోయే 
చక్కనైన కుందేలు -చకచకమని గంతులేసె
చక్కనైన కుందేలు....

🎻 *చరణం 1:*
బాధనేమొ తాళ లేక --బావురుమని ఏడ్చింది 
కదలలేక మెదలలేక - కూలబడి పోయింది
చూచినట్టె పిచ్చుకమ్మ- అందరికి చెప్పింది
చూచినట్టె పిచ్చుకమ్మ- అందరికి చెప్పింది 
ఎద్దన్న డాక్టరొచ్చి-పసరుమందువేసింది
ఎద్దన్న డాక్టరొచ్చి-పసరుమందువేసింది
చక్కనైన కుందేలు -చకచకమని గంతులేసె
చక్కనైన కుందేలు...

🎻 *చరణం 2:*
సాటి జీవులన్నివచ్చి-పలకరించి వెళ్ళాయి
స్నేహితులు చెంతచేరి -సేవలెన్నొ చేశాయి
కాలమేమో గడిచింది -కుందేలు కోలుకుంది
కాలమేమో గడిచింది -కుందేలు కోలుకుంది
నేస్తములకందరికి-కృతజ్ఞతలు చెప్పింది 
నేస్తములకందరికి-కృతజ్ఞతలు చెప్పింది
చక్కనైన కుందేలు -చకచకమని గంతులేసె
చక్కనైన కుందేలు...
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vimdaam Nerchukundaam Radio Lesson 11.09.19 Wednesday"

Post a comment