Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

10% reservation in EWS quota ... Details of 8 documents required for certificate

EWS Quota: ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్... సర్టిఫికెట్ కోసం కావాల్సిన 8 డాక్యుమెంట్స్ వివరాలు
10% reservation in EWS quota ... Details of 8 documents required for certificate

1. Income Certificate: ఈడబ్ల్యూఎస్ కోటా ప్రయోజనాలు పొందాలంటే ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి రూ.8 లక్షల లోపు ఇన్‌కమ్ సర్టిఫికెట్ ఉండాలి

2.Caste Certificate: ఈడబ్ల్యూఎస్ కోటా పొందాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. సాధారణంగా అగ్రవర్ణాలకు చెందినవాళ్లు కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ పొందాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాల్సిందే.

3.BPL Card: అగ్రకులాలకు చెందినవాళ్లు ఆర్థికంగా వెనుకబడ్డట్టు నిరూపించడానికి బీపీఎల్ కార్డ్ ఉపయోగపడుతుంది. దారిద్ర్యరేఖ(BPL)కు దిగువన ఉన్నవారికి ఇచ్చే కార్డు ఇది.

4.PAN Card: అన్ని ఉద్యోగాలకు, విద్యావకాశాలకు పాన్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కాబట్టి పాన్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి.

5.Aadhaar Card: రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ తప్పనిసరి చేసింది కేంద్రం. దరఖాస్తుదారులు భారతీయులేనని నిరూపించడానికి ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. మీరు ఆధార్ కార్డు జత చేస్తే మీకు సంబంధించిన సమస్త సమాచారం ప్రభుత్వం తెలుసుకోవడానికి అవకాశముంటుంది.

6.Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి. మీ ఆదాయం రూ.8 లక్షలకు మించి లేకపోతే ఆ విషయం నిరూపించడానికి ఫామ్ 16 సాయపడుతుంది.

7.Bank Passbook: ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉంటే పాస్ బుక్ కాపీ ఉండాలి. దాంతో పాటు గత 3 నెలల్లో మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి.

8.Jandhan Scheme: మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ పొందాలంటే జన్‌ధన్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి. ఈ స్కీమ్‌లో లబ్ధిదారుల్ని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలుగా గుర్తిస్తుంది ప్రభుత్వం


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "10% reservation in EWS quota ... Details of 8 documents required for certificate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0