About Letstrack
మీ కారు లేదా బండి ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే!
సహజంగా మన వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లొకేషన్ Google Maps ద్వారా తెలుసుకుంటాం.
అయితే అసలు మీరు వాహనం లో లేనప్పుడు, మీ స్నేహితులు లేదా తెలిసిన వారు ఎవరికైనా వెహికల్ ఇచ్చినప్పుడు, ప్రస్తుతం అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే.. ఒక అద్భుతమైన కొత్త డివైస్ అందుబాటులోకి వచ్చింది.
Letstrack అని పిలవబడే ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ని ఇండియాలో విక్రయిస్తున్నారు.
దీంట్లో జిపిఎస్ యూనిట్లో ఒక సెల్యులార్ కాంపోనెంట్ ఉంటుంది. అది GSM Edge నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని మీ కార్లో లేదా టు వీలర్‌లో రహస్యంగా అమర్చడం జరుగుతుంది. ఈ డివైస్ లో అంతర్గతంగా ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ ఆధారంగా పనిచేసే సిమ్ కార్డు పొందుపరచబడి ఉంటుంది.
దీంట్లో ప్రధానంగా మూడు వైర్లు ఉంటాయి. వీటిలో ఒకటి బ్యాటరీ కి కనెక్ట్ అవుతుంది, అలాగే మరొకటి ఇగ్నిషన్ వైర్ కి కనెక్ట్ చేయబడుతుంది.
అలాగే ఈ డివైస్ కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ఇకమీదట మీ కారు లేదా టు వీలర్ ఆన్ లేదా ఆఫ్ చేసిన ప్రతిసారీ మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ చూపిస్తుంది.
కేవలం ఈ సమాచారం మాత్రమే కాదు, మీ కారు ఎక్కడ పార్క్ చేయబడి ఉంది, ఇప్పటికిప్పుడు రియల్ టైమ్ లొకేషన్, కారులో ఏసి ఆన్ చేయబడి ఉందా, లేదా ఆఫ్ చేయబడి ఉందా, ఒక నిర్దిష్టమైన స్పీడు కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు దానికి సంబంధించిన అలర్టులు చూపించడం, యాంటీ-థెప్ట్ అలారమ్, అలాగే మీ కారు లేదా టు వీలర్‌లో ఇంధనం ఏ స్థాయిలో ఉంది వంటి పూర్తిస్థాయి సమాచారం ఈ డివైస్ ద్వారా మీకు లభిస్తుంది.
Letstrack డివైస్ లో అనేక రకాల మోడల్స్ లభిస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి, అలాగే బడ్జెట్ ను బట్టి కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

0 Response to "About Letstrack"
Post a Comment