Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Helmet ... necessary .. Running on April 12th

 హెల్మెట్‌... ఇక తప్పదు.. ఈనెల 12 నుంచి ఏపీలో అమలు


  • ఈ నెల 12 నుంచి అమలు
  • పోలీసు, రవాణా అధికారులు సిద్ధం
  • ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు
  • తొలిసారి పట్టుబడితే నెల...
  • రెండోసారి పట్టుపడితే శాశ్వతంగా లైసెన్సు రద్దు

Helmet ...  necessary .. Running on April 12th

 రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణే లక్ష్యంగా అధికార యంత్రాంగం మరోసారి సన్నద్ధమవుతోంది. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసు, రవాణా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, తద్వారా జరిగే మరణాలను అరికట్టేందుకు హెల్మెట్‌ధారణ తప్పనిసరి చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌ వినియోగం తప్పనిసరి అని పోలీసు, రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. గతంలో ఇదే తరహాలో అనేక సార్లు ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కేంద్రం కూడా రోడ్డు ప్రమాదాలపై కఠినంగా వ్యవహరిస్తూ భారీ జరిమానాలకు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసు, రవాణాశాఖ అధికారులు ఈ దఫా హెల్మెట్‌ వినియోగాన్ని తప్పని సరి చేశారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. శిరస్ర్తాణం లేకుండా పట్టుబడిన వాహన చోదకుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించాయి. మొదటి సారి పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. మొదటిసారి పట్టుబడిన వారు నెల పాటు ద్విచక్ర వాహనాలను నడపడానికి అనర్హులు అవుతారు. ఆ సమయంలో పట్టుబడితే భారీగా జరిమానాలు విధిస్తారని అధికారులు నిర్ణయించారు. హెల్మెట్‌ లేకుండా రెండోసారి పట్టుబడితే వారి డ్రైవింగ్‌ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాద మరణాలు

జిల్లాలో సగటున నమోదవుతున్న మరణాల సంఖ్యను పరిశీలిస్తే సగానికి పైగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించే జరుగుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా గణంకాలను పరిశీలిస్తే రోడ్డు ప్రమాదాల మరణాలు వందశాతం పెరిగాయి. నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో జాతీయ రహదారులకే పరిమితమైన రోడ్డు ప్రమాద మరణాలు ప్రస్తుతం రాష్ట్ర, స్థానిక రహదారుల్లోనూ ఆందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం విశ్లేషిస్తోంది. జిల్లాలో పెరిగిన ఆర్థిక వనరుల దృష్ట్యా వాహనాల వినియోగం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే గడిచిన కొన్నేళ్లుగా జిల్లాలో కార్లు వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇంటికి ఒకటి తక్కువ కాకుండా ద్విచక్ర వాహనాలున్నాయి. వాహనాల వినియోగం పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రోడ్ల విస్తరణ జరగకపోవడం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేకపోవడం, స్పీడు బైక్‌ల వినియోగం వంటివి కూడా కారణాలుగా అధికారులు చెబుతున్నారు.

ప్రజల్లోనూ మార్పు రావాలి

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాద మరణాలను నియంత్రించాలంటే ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ ధరించడం, కారు నడిపేవారు సీటు బెల్టు ధరించడంతో పాటు, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండడం వంటి చర్యలు తీసుకోవా ల్సిందేనని అధికార యంత్రాంగం భావిస్తోంది. తాము ఎంత ఒత్తిడి చేసినప్పటికీ ప్రజల్లోనూ మార్పు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Helmet ... necessary .. Running on April 12th"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0