Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corporate Elements for Public Schools ..


  • ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ సొబగులు..
  •  మనబడి నాడు-నేడు పేరుతో కార్యక్రమం..
  • మొత్తం తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించాలని యోచన  
  •  మూడేళ్లలో అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు 
  •  జిల్లాలో మొదటి ఏడాది 1 , 240 పాఠశాలల ఎంపిక 
  • ఏడాదికి రూ . 200 కోట్ల నిధులు వచ్చే అవకాశం
Corporate Elements for Public Schools ..


పిల్లలను కచ్చితంగా చదివించేలా ' అమ్మఒడి ' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . . ఇప్పుడు ప్రభుత్వ పాఠ శాలల్లోనే చదివించేలా చర్యలకు ఉప క్రమించారు . కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా . . ఇంకా చెప్పాలంటే అంతకు మించిన సౌకర్యాలను కల్పించేందుకు నిర్ణయించారు . జిల్లాలో మొదటి ఏడాది 1 , 240 ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించను న్నారు . మన బడి నాడు - నేడు శీర్షికన చేపట్టబోయే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏకంగా రూ . 200 కోట్ల చొప్పున వచ్చే ఆవకాశం ఉందని అధికారులుఅంచనా వేస్తున్నారు . ఈ విధంగా కార్యక్రమం అమలు అందిన తర్వాత గతంలో పాఠశాల ఏ విధంగా ఉండే ది ? ఇప్పుడు ఎలా ఉందనే అంశాన్ని ఫొటోలతో సహా ప్రజల ముందు ప్రభుత్వం ఉంచనుంది . అంతేకా కుండా పాఠశాలల్లో సౌకర్యాల కల్ప నలో స్థానికుల సహకారం తీసుకో వడం ద్వారా నాణ్యత విషయంలో రాజీ లేకుండా చూడాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .

 9 సౌకర్యా లతో . . . .


  •  ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు ఏమిటనే అంశాలపై ఇప్ప టికే ప్రభుత్వం ఒక అధ్యయనం చేయించింది . ఇందులో భాగంగా 8 రకాల అంశాలను గుర్తించింది . అవి . . . 
  • 1 . నిరంతరం నీటిసౌకర్యంతో టాయిలెట్ల నిర్మాణం
  •  2 . పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు , ట్యూబ్ లైట్ల ఏర్పాటు 
  • 3 . తాగునీటి సరఫరా
  •  4 . ఉపాధ్యాయులకు , విద్యార్థులకు ఫర్నిచర్ సౌకర్యం
  •  5 . మొత్తం క్యాంపు పెయింటింగ్
  •  6 . చిన్న , పెద్ద మరమ్మతులు
  •  7 . బ్లాక్ బోర్డులు 
  • 8 . అదనపు తరగతి గదుల నిర్మాణం 
  • 9 . కాంపౌండు గోడ . . . 
  • ఈ సౌకర్యాలు గతంలో ఉన్న పాఠశాలలో కూడా . . సమస్యలు వెంటనే వస్తున్నాయి . పాఠశాల కాంపౌండు గోడ నిర్మించిన ఏడాదికే చిన్నపాటి గాలివానకే కూలిపో తోంది . ఇక తరగతుల నిర్మాణం పూర్తయితే రెండేళ్లల్లోనే పైకప్పు ఊడిపోతోంది . ఫ్లోరింగ్ 6 నెలల్లోనే గుంతలు పడి టైల్స్ పగిలిపోతున్నాయి . అందువల్ల కొత్తగా చేపట్టబోయే నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొంటున్నారు . ఏయే పనికి ఏ రకమైన నాణ్యత కలిగిన బ్రాండెంట్లను వాడాలనే అంశాన్ని కూడా నిర్దేశించను న్నారు . ఫలితంగా ఈ సౌకర్యాలు కల్పించిన తర్వాత కొన్నేళ్ల పాటు పనులు గుర్తుండిపోయేలా ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది .

మూడేళ్లల్లో . . : 

జిల్లాలో మొత్తం 3 , 834 ప్రభుత్వ పాఠశా లలు ఉండగా . . వీటన్నింటిలో తొమ్మిది సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను రచించింది . ఇందులో భాగంగా మొదటి ఏడాది 1 , 240 పాఠశాలల్లో తొమ్మిది సౌకర్యాలను కల్పించనున్నారు . ఇందుకోసం ప్రస్తుతం ఆయా పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయనే వివరా లతో కూడిన ఫొటోలను అప్లోడ్ చేస్తారు . పనులు పూర్తి చేసిన తర్వాత ఏ విధంగా మార్పు చెందాయనే అంశాన్ని కూడా పేర్కొంటూ ఫొటోలను అప్లోడ్ చేస్తారు . వీటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ మనబడి నాడు నేడు శీర్షికన అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . అంతేకాకుండా ఈ పనుల్లో కూడా స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం స్పష్టంగా అధికారు లకు ఆదేశాలు జారీచేసింది . మొదటి విడతలో చేపట్టబోయే పనుల్లో 252 ప్రాథమిక పాఠశాలలు , 111 ప్రాథమికోన్నత పాఠశాలలు , 122 ఉన్నత పాఠశాలల్లో పనులను ఆంధ్రప్ర దేశ్ విద్యాసంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ( ఏపీఈడ బ్ల్యుఐడీసీ ) చేపట్టనుండగా . . 433 పీఎస్ , 172 యుపీఎస్ , 150 హెచ్ఎస్ పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ ( ఎస్ఎస్ఏ ) పనులు నిర్వహించనుంది . మొత్తం మీద 685 ప్రాథమిక పాఠశాలలు , 283 ప్రాథమికోన్నత పాఠశాలలు , 272 ఉన్నత పాఠశాలలలు కలిపి 1 , 240 పాఠశాలలకు సకల హంగులు సమకూరనున్నాయి . మరోవైపు ఇప్పటికే జిల్లాలోని హాస్ట క్లల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు జిల్లా కలెక్టర్ల చేతికి ప్రత్యేకంగా రూ . 15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది . ఈ నిధులతో ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి .


  •  ప్రతి క్లాస్ రూంలో నాలుగు ఫ్యాన్లు , నాలుగు ట్యూబ్ లైట్లు 
  •  ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ 
  • ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక వాష్ కైసిన్ 
  • దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్ సదుపాయం 
  • విద్యా ర్థినుల ప్రత్యేక అవసరా లకు అనుగుణంగా ( న్యాప్కిన్స్ మార్చుకునేందుకు వగైరా ) టాయిలెట్ల నిర్మాణం ! ! 
  •  అన్ని పాఠశాలల భవనాలకు కొత్తగా పెయింటింగ్ . . .
  •  ఈ విధంగా అన్ని హంగు లతో ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఏమవుతుంది ? 
  • ప్రతి ఇంట్లో విద్యా వెలుగులు విరజిమ్మడం ఖాయం . 
  • రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది . 
  • ఇందుకోసం ' మనబడి నాడు - నేడు ' కార్యక్ర మానికి శ్రీకారం చుడుతోంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corporate Elements for Public Schools .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0