Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you use a credit card? Benefit With Card Protection Plan

Credit Card: క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలివే...

Card Protection Plan | ప్రయాణాల్లో కార్డులు, నగదు పోగొట్టుకుంటే బ్యాంకులు మీకు నగదును సర్దుబాటు చేస్తాయి. ఆ డబ్బును తిరిగి 28 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది
Do you use a credit card? Benefit With Card Protection Plan

కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను వేర్వేరు బ్యాంకులు అందిస్తుంటాయి. కార్డుల కారణంగా మీరు నష్టపోయే మొత్తానికి ఇవి రక్షణ కల్పిస్తుంటాయి. క్రెడిట్ కార్డులకే కాదు డెబిట్ కార్డులకూ ప్రొటెక్షన్ ప్లాన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు పాన్ కార్డ్, ఆధార్ కార్డులకు కూడా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ వర్తిస్తుంది. మీరు కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవాలంటే కంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఫీజు మారుతుంది. ప్లాన్ రేంజ్ రూ.900 నుంచి రూ.2200 మధ్య ఉంటుంది. ఇది వార్షికంగా మీరు చెల్లించే ఫీజు.

కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి క్లాసిక్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది బేసిక్ ప్లాన్. రెండోది ప్రీమియం కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది మిడ్ రేంజ్ ప్లాన్. మూడోది ప్లాటినమ్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది హైఎండ్ ప్లాన్.*

 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి మీరు కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ తీసుకోవచ్చు. మీ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా ఆ తర్వాత జరిగే లావాదేవీల నుంచి రక్షణ కల్పిస్తుంది కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్. అయితే కార్డు పోగొట్టుకున్న వెంటనే మీకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మీ ఫోన్‌లో టోల్ ఫ్రీ నెంబర్ సేవ్ చేసుకోవాలి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్యాంకు సిబ్బంది మీకు కార్డు జారీ చేసిన సంస్థను సంప్రదించి మీ కార్డుల్ని బ్లాక్ చేయిస్తారు. మీ ప్రయాణ టికెట్లు పోగొట్టుకున్నా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో మీ జర్నీ టికెట్లను రీప్లేస్ చేయించొచ్చు. ఇందుకోసం మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ హోటల్ బిల్లలుకూ ఇది వర్తిస్తుంది. అయితే గరిష్టంగా ఎంతవరకు పొందొచ్చు అన్నది మీరు తీసుకునే ప్లాన్‌ను బట్టి ఉంటుంది. విదేశాలకు వెళ్లినా కూడా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ వర్తిస్తుంది. ప్రయాణాల్లో కార్డులు, నగదు పోగొట్టుకుంటే బ్యాంకులు మీకు నగదును సర్దుబాటు చేస్తాయి. ఆ డబ్బును తిరిగి 28 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.

 మీరు ఎక్కువ కార్డులు ఉపయోగిస్తున్నట్టైతే కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. మీ కార్డులు పోయినట్టైతే మీరు అన్ని బ్యాంకుల కస్టమర్ కేర్‌కు కాల్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తున్న బ్యాంకుకు కాల్ చేస్తే చాలు. అన్ని కార్డులను బ్లాక్ చేయించే బాధ్యత వారిదే. తరచూ ప్రయాణించేవారికి, ఎక్కువగా కార్డులు ఉపయోగించేవారికి కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుంటా అండగా నిలుస్తుంది*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you use a credit card? Benefit With Card Protection Plan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0