Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of patients receiving treatment in government hospitals will be registered.


  • వైద్యానికీ ఆధార్‌..ఇకపై ప్రభుత్వాస్పత్రుల్లో ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి.
  • త్వరలో ‘మేరా హాస్పిటల్‌’ కార్యక్రమం ప్రారంభం
  • తొలివిడతలో కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అమలు
  • ఫలితాలను బట్టి జిల్లా అంతటా అమలు చేసే అవకాశం
  • సేవలు ఎలా అందుతున్నదీ రోగుల నుంచి తెలుసుకోనున్న కేంద్రం
  • ఇప్పటికే రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో అమలవుతున్న కార్యక్రమం
Details of patients receiving treatment in government hospitals will be registered.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందే రోగుల వివరాలు ఇకపై పక్కాగా నమోదు చేయనున్నారు. ఇందుకోసం ‘మేరా హాస్పిటల్‌’ పేరుతో కేంద్రం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. మరికొద్దిరోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి నుంచి తప్పనిసరిగా ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ సేకరిస్తారు. ఈ రెండు నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదుచేసిన తరువాతే రోగికి అవుట్‌ పేషెంట్‌ టోకెన్‌ ఇవ్వడంతోపాటు సేవలను అందిస్తారు. ఈ వివరాలను మేరా హాస్పిటల్‌ పోర్టల్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిరోజు పరిశీలిస్తుంది.*

నిధుల వినియోగంపై దృష్టి


ఈ విధానం ద్వారా ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతోపాటు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రాలకు అందిస్తున్న నిధుల వినియోగం ఏ విధంగా వుందో తెలుసుకునేందుకు అవకాశముందని కేంద్రం భావిస్తోంది. ఆయా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, వాతావరణం, మందులు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ, లేనిదీ రోగులను అడిగి తెలుసుకోనున్నది. ప్రతిరోజూ ఆసుపత్రులకు వచ్చే రోగుల ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నెంబరును పోర్టల్‌లో ఎంటర్‌ చేయడం ద్వారా ఆయా ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య తెలుస్తుంది. వైద్య సేవలు ఎలా అందుతున్నదీ ఐవీఆర్‌ఎస్‌ విధానంలో నేరుగా రోగులకు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకోనున్నారు.

ఈ విధంగా సేకరించిన డేటా ఆధారంగా ఆసుపత్రి పనితీరును కేంద్రం అంచనా వేస్తుంది. పనితీరు ఆధారంగా ప్రస్తుతం అందిస్తున్న నిధులతోపాటు భారీమొత్తంలో ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మొత్తాలు సక్రమంగా వినియోగమవ్వాలంటే నేరుగా రోగుల ద్వారానే సమాచారం సేకరించడమే మార్గమని భావిస్తోంది.

ఆసుపత్రులకు ర్యాంకులు

మేరా హాస్పిటల్‌ పథకంలో భాగంగా నమోదైన ఆస్పత్రులకు రోగుల నుంచి తీసుకున్న ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇవ్వనుంది. ముందుగా ఆయా ఆసుపత్రుల్లో సేకరించిన డేటాను బట్టి గ్రేడింగ్‌లు కేటాయించి, ఆయా ఆసుపత్రులకు వచ్చిన గ్రేడులు బట్టి ర్యాంకులు ఇస్తారు. సేవల్లో లోపాలుంటే వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నది. ఇందుకోసం ప్రతి ఆసుపత్రికి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of patients receiving treatment in government hospitals will be registered."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0