Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of risky apps that shouldn't be on your iPhone


మీ ఐఫోన్ లో.. ఈ Apps ఉంటే చాలా ప్రమాదకరం.

Details of risky apps that shouldn't be on your iPhone

మీరు ఐఫోన్ వాడుతున్నారా? జర జాగ్రత్త. మీరు వాడే ఐఫోన్ పాపులర్ iOS యాప్స్ లో డేంజరస్ యాప్స్ ఉన్నాయట. ఈ యాప్స్ మీ ఫోన్ లో ఏం చేస్తున్నాయో గుర్తించలేరు. కనీసం మీ పర్మిషన్ కూడా తీసుకోవు. మీకు తెలియకుండానే ఐఫోన్ స్ర్కీన్ పై మీ పర్సనల్ డేటాను రికార్డు చేస్తున్నాయట. ఈ నమ్మలేని నిజాన్ని టెక్ క్రంచ్ బయటపెట్టింది. ఐఫోన్ లో ఉండే కొన్ని పాపులర్ యాప్స్ ఇదంతా చేస్తున్నట్టు గుర్తించింది. పాపులర్ ఐఫోన్ యాప్స్ ఎనాల్టిక్స్ కంపెనీ గ్లాస్ బాక్స్ (Glassbox)ను సెషన్ రిప్లేయింగ్ యూజ్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా ఆయా యాప్ లపై యూజర్లు చేసే ప్రతి మూమెంట్ ను రికార్డు చేస్తాయి. క్రెడిట్, డెబిట్ వంటి ఫైనాన్షియల్ ఇన్మరేషన్ కూడా క్యాప్చర్ చేస్తున్నాయట. యూజర్ల స్ర్కీన్లను రికార్డు చేసే సమయంలో కనీసం సదరు యూజరు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోనేది ఉండదు. చడిచప్పుడు కాకుండా మీ విలువైన డేటాను తస్కరిస్తుంటాయి.

ఆ డేంజరస్ యాప్స్ ఇవే..


ఐఫోన్ లో పాపులర్ యాప్స్ బంచ్ గా పిలువబడే డేంజరస్ యాప్స్ ఇవే.. ఎయిర్ కెనడా, ఎక్సీపీడియా యాప్స్ యూజర్ల యాక్షన్లను ఎప్పటికప్పుడూ గ్లాస్ బాక్స్ ఎనాలిటిక్స్ ద్వారా రికార్డు చేస్తున్నట్టు టెక్ క్రంచ్ గుర్తించింది. ఈ యాప్స్ తో పాటు మరికొన్ని యాప్స్ ను కూడా హోటళ్లు, ట్రావెల్ వెబ్ సైట్లు, ఎయిర్ లైన్స్, బ్యాంకుల పేరుతో ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఈ యాప్స్ యూజర్ల డేటాను రికార్డు చేస్తున్నాయా? రికార్డు చేసిన డేటాను ఏం చేస్తారనేదానిపై కూడా స్పష్టత లేదు. కామన్ గా ఎవరీ సింగిల్ ట్యాప్, కీబోర్డు ఎంటరీ, బటన్ పుష్ వంటి వాటిపై యాప్ డెవలపర్లు యూజర్ల డేటాను రికార్డు చేసే టెక్నాలజీని ఎనేబుల్ చేస్తారు. యూజర్లు సదరు యాప్ వాడుతునప్పుడు మాత్రమే ఈ డేటా క్యాప్చరింగ్ జరుగుతుంది తప్ప యాప్ క్లోజ్ చేసినప్పడు మాత్రం ఉండదు.

గ్లాస్ బాక్స్ సెషన్ రిప్లే టెక్నాలజీని సింగపూర్ Airlines, Hotels.com (ఎయిర్ లైన్స్, హోటల్స్.కామ్) కంపెనీ యాప్స్ కూడా వాడుతున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో యూజర్లు ఎలా వాడుతున్నారనేది బ్యాక్ అండ్ స్ర్కీన్లపై రికార్డు చేస్తుంటాయి. నిజానికి యూజ్ ఫుల్ డెవలపర్ ఫీచర్ మాత్రమే. కొన్ని పాపులర్ యాప్స్ మాత్రమే యూజర్ల ఫైనాన్షియల్ డేటాను రికార్డు చేస్తున్నాయని, అన్నీ యాప్స్ అలా కాదని పేర్కొంది. యూజర్లు డేటాను ఒకసారి డివైజ్ స్ర్కీన్ పై రికార్డు చేశాక.. సదరు యాప్ డెవలపర్ కు డేటాను సెండ్ చేస్తాయి. ఎయిర్ కెనడా ఐఓఎస్ యాప్ లో ఇదే జరిగినట్టు టెక్ క్రంచ్ గుర్తించింది. యూజర్ పాస్ పోర్ట్ నెంబర్, క్రెడిట్ కార్డు వివరాలను మొత్తం డెవలపర్ కు చేరవేసినట్టు తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of risky apps that shouldn't be on your iPhone"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0